దేశంలో ఇప్పుడు మళ్లీ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తమిళనాడు రాష్ట్రం పుదుకొట్టాయ్ జిల్లా ఎంబాల్ గ్రామంకి చెందిన‌ జయప్రియ అనే ఏడేళ్ల బాలిక కామాంధుల చేతిలో బ‌లికావ‌డం ప్ర‌తి ఒక్క‌రిలో ఆగ్ర‌హ‌జ్వాల‌ల‌ని ర‌గిలింప‌జేస్తుంది. ఇప్పుడు ఈ విషయం గురించి తెలిసి దేశమంతా భగ్గుమంటుంది.  నిన్న నటి సాయిపల్లవి ఇక మరో బిడ్డను కనడం అవసరమా అన్న బాధగా అడింది. మాన‌వ‌జాతిని పూర్తిగా తుడిచిపెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌కృతి హెచ్చ‌రిస్తున్న‌ట్టుగా ఉంది. అలాంటి దారుణ ఘటనలు చూడానికి ఇలాంటి దారుణమైన జీవితాన్ని గడుపుతున్నాం.. ఈ అమానవీయ ప్రపంచానికి మరో బిడ్డకు జన్మనివ్వడానికి అర్హత లేదు. అలాంటి రోజు రాకూడదు. తాజాగా త‌మిళ న‌టి వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్ కూమార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా.. స‌మాజంలో ఏం జ‌రుగుతోంది అని మండిప‌డింది. ఎలాంటి స‌మాజంలో మ‌నం నివ‌సిస్తున్నాం.

IHG

చిన్నారిపై అత్యాచారం చేసి చంప‌డం ఎంత దారుణం. మ‌నమంద‌రం క‌రోనా వైర‌స్ బారిన ప‌డి క‌న్నుమూయాల్సిందే అంటూ వ‌ర‌ల‌క్ష్మీ వీడియో ద్వారా చెప్పుకొచ్చింది. ఇలాంటి దారుణాలు చూసి మనం బతికి ఉన్నా చచ్చినట్టే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నారిపై జరిగిన హత్యాచారం చూస్తుంటే మనమంతా బ్రతికేందుకు అనర్హులమనే భావన కలుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వ‌ర‌ల‌క్ష్మీ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.  ఇక #JusticeForJayapriya అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్ట‌ర్‌లో హోరెత్తిస్తూ ఆమెకి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఆ మద్య నిర్భయ నింధితులకు ఉరిశిక్ష పడింది. దిశ నింధితులు ఎన్ కౌంటర్ అయ్యారు.. అయినా కొంత మంది బుద్ది మాత్రం మార్చుకోవడం లేదని మహిళాసంగాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: