మంచు లక్ష్మి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మంచి లక్ష్మి చేసింది తక్కువ సినిమాలే అయినా.. భారీ ఫాలోంగ్ ఏర్పర్చుకుంది.

విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె నటిగానేకాక వ్యాఖ్యతగా, నిర్మాతగా కూడా తన ప్రత్యేకను చాటుకుంది. ఇక సామాజిక సమస్యలపై స్పందించటంలోనూ మంచు లక్ష్మి ముందుటుంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎందరో అభిమానులను సంపాధించుకుంది. అలాగే ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్‌తో అదరగొడుతోంది మంచు లక్ష్మి. తాజాగా రవివర్మ గీసిన చిత్రంలో బొమ్మగా మారిపోయింది. ప్రస్తుతం మంచు లక్ష్మి కొత్త లుక్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.









క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి