ఇక ఈ సినిమా పోస్టర్స్ హడావిడి చూసి సినిమా తప్పకుండా యూత్ ను ఆకట్టుకునేలా ఉందని శాటిలైట్, డిజిటల్ రైట్స్ కు మంచి రేటు వచ్చింది. అఖిల్ బ్యాచ్ లర్, నాగ చైతన్య లవ్ స్టోరీ రెండిటికి కైపి అమేజాన్ రేటు ఫిక్స్ చేయగా బ్యాచ్ లర్ సినిమాకు శాటిలైట్ రైట్స్ ఆరున్నర కోట్ల దాకా వచ్చాయని టాక్. బ్యాచ్ లర్ సినిమా హక్కులను స్టార్ మా దక్కించుకుంది. అఖిల్ కెరియర్ లో ఫ్లాపులు వస్తున్నా శాటిలైట్ విషయంలో మాత్రం అదరగొట్టింది.
ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. కింగ్ నాగార్జున కూడా అఖిల్ బ్యాచ్ లర్ సినిమా మీద ఓ కన్నేసి ఉంచాడట. సినిమా ప్రస్తుతం ఎడిటింగ్ జరుపుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో నాగార్జున సలహాలు కూడా తీసుకుంటున్నారట. మరి అఖిల్ బ్యాచ్ లర్ జోష్ బాగున్నా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. యూత్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసేలా బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాలో తన క్రియేటివిటీ చూపిస్తున్నారట. సినిమా తప్పకుండా ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు చిత్రయూనిట్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి