స్టైలీష్ అల్లు అర్జున్, టైగర్ ష్రాఫ్ ఇద్దరూ మంచి అండర్ స్టాండింగ్ తో ముందుకెళ్తున్నారు. అల్లు అర్జున్ కు ముంబయిలో సపోర్ట్ చేస్తే, హైదరాబాద్ లో టైగర్ ష్రాఫ్ కు సాయం చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియన్ స్టార్స్ గా ఎదగడానికి ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారని ముంబయి జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ అగ్రిమెంట్ తోనే టైగర్ మార్కెట్ పెంచుకోవడానికే ముంబయిలో అడుగుపెడుతున్నాడట అల్లు అర్జున్.
టైగర్ ష్రాఫ్ ‘హీరోపంతి’ సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు. అల్లు అర్జున్ ‘పరుగు’రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీకే ఇప్పుడు సీక్వెల్ చేయాలనుకుంటున్నాడట టైగర్. ఈ ‘హీరోపంతి-2’లో అల్లు అర్జున్ ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నాడని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. తెలుగు, మళయాళంలో సూపర్ క్రేజ్ ఉన్న బన్ని సినిమాలో ఉంటే, సౌత్ లో మార్కెట్ సంపాదించుకోవచ్చని ఫీలవుతున్నాడట టైగర్. అందుకే అల్లు అర్జున్ ని స్పెషల్ రోల్ కి ఒప్పించాడట టైగర్ ష్రాఫ్.
అల్లు అర్జున్ కూడా ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ గా ఎదగాలని ట్రై చేస్తున్నాడు. ‘పుష్ప’, కొరటాల శివ సినిమాలని నార్త్ లోనూ భారీగా రిలీజ్ చెయ్యాలనుకుంటున్నాడు. అందుకే టైగర్ ష్రాఫ్ నుంచి ప్రపోజల్ రాగానే బన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు. టైగర్ సినిమాల్లో తాను స్పెషల్ రోల్ చేసినట్లుగానే, తన సినిమాల్లో టైగర్ తో స్పెషల్ రోల్ చేయిస్తే బీటౌన్ లో కలిసొస్తుందని ప్లాన్ చేశాడట బన్నీ. మరి ఈ ప్లాన్ తో వీళ్లిద్దరు కలిసి ఎన్ని సినిమాలు చేస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి