కొన్నాళ్ళ క్రితం మహేష్ బాబు, వెంకటేష్ కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను సాధించారన్న సంగతి తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్ కలసి నటించిన ఫిదా సినిమా కూడా ప్రేక్షకుల మనసులను అమాంతం దోచేసింది. మల్టీస్టారర్ సినిమాలన్నీ కూడా దాదాపు సూపర్ హిట్స్ గా నిలుస్తాయి. కానీ మన తెలుగు హీరోలు మాత్రం మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి అసలు ఇష్టపడరు. తెలుగు ప్రేక్షకులు ఎప్పటినుండో బాలకృష్ణ, చిరంజీవి మల్టీస్టారర్ సినిమాను చూడాలని ఉవ్విళూరుతున్నారు. కానీ ఆ మల్టీస్టారర్ డ్రీమ్ ప్రాజెక్ట్ నిజమవుతుందా అన్న అనుమానం సంవత్సరాలు గడిచిపోతున్న కొద్దీ బలపడిపోతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత మంది అభిమానులున్నారో మహేష్ బాబు కూడా అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తే... ఆ మల్టీస్టారర్ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో ఊహించు కోవచ్చు. ప్రభాస్ - రామ్ చరణ్.. ప్రభాస్-అల్లు అర్జున్.. ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్.. రామ్ పోతినేని- నాని.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులను ఫుల్ గా అలరించవచ్చు. కానీ ఈ డ్రీమ్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడానికి ఏ దర్శకుడైనా ఆసక్తి చూపుతారా అన్నది ప్రస్తుతం అందరి మనసులో తీరని కోరిక గా మిగిలిపోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి