ఇప్పటికి తెలుగులో బిగ్ బాస్ మూడు సీజన్స్ ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ నాల్గవ సీజన్ నేడు ప్రారంభం కానుంది. ఈ షో కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరికీ బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ షోలో ఈ అందాల భామ రాబోతోంది. ఈ మేరకు ఆమె పలు విషయాలని షేర్ చేసుకుంది. మనల్ని మనం ప్రేక్షకులకు దగ్గర చేసుకోవడానికి బెస్ట్‌ మీడియమ్ బిగ్ బాస్ అని అంది ఈమె‌. అలానే ''నాలాంటి యంగ్‌ యాక్టర్‌కు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను’’ అన్నారు దివీ వైద్య. నేటి నుంచి  ప్రారంభం అవుతున్న ఈ షోలో ఈమె  వన్ ఆఫ్ ద కంటెస్టెంట్.

ఈ యాక్టర్ ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసి  యమ్‌టెక్‌ కూడా చేసింది. ఆ తరువాత ఆమెకి సినిమా మీద ఉండే ప్యాషన్ ‌తో ఇండస్ట్రీ కి రావడం జరిగింది. నా నిర్ణయాన్ని మా కుటుంబం కూడా సపోర్ట్‌ చేసింది అని చెప్పారు.ముందు మోడలింగ్‌ చేసిన ఈమె సినిమాల్లోకి అడుగు పెట్టింది. ‘మహర్షి’ సినిమాలో మహేశ్‌బాబు తో కలిసి ఒక  సన్నివేశంలో కూడా చేసారు.

ప్రస్తుతం ఈమె సందీప్‌ కిషన్‌ తాజా సినిమాలో మరదలిగా పాత్ర చేసింది. దీనితో పాటు  కొన్ని కవర్‌ సాంగ్స్‌ కూడా చేశానని ఈమె అన్నారు. అయితే ఇవి మాత్రం కోవిడ్‌ వల్ల ఇవేమీ విడుదల కాలేదన్నారు. ఇది ఇలా ఉండగా ఈమె బిగ్‌బాస్‌ ఎంపిక జరుగుతుందని తెలుసుకొని ఇంటర్వ్యూకి వెళ్లడం జరిగిందన్నారు.  ఆ తర్వాత మూడు రోజుల తర్వాత సెలెక్ట్‌ అయ్యావని చెప్పారు అని ఈమె చెప్పారు. ప్రేక్షకులకు పరిచయం కాని కొత్త ఫేస్‌ నాది.  ఓపెన్‌ మైండ్‌తోనే వెళ్తున్నాను. సింపతీ కార్డ్‌ ప్లే చేయి అని కొందరు సలహా ఇచ్చారు. కానీ నేను నాలానే ఉండాలనుకుంటున్నాను అని అన్నారు దివీ వైద్య.  .


మరింత సమాచారం తెలుసుకోండి: