ఈవారం అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్న ‘నిశ్శబ్దం’ మూవీ రిజల్ట్ గురించి ఇండస్ట్రీ వర్గాలు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. ‘వి’ మూవీతో అనుకున్న టార్గెట్ సాధించలేకపోయిన అమెజాన్ ప్రైమ్ ‘నిశ్శబ్దం’ పై భారీ అంచనాలు పెట్టుకుంది. దీనితో ఈమూవీని ప్రమోట్ చేస్తూ అనేక ప్రముఖ ఛానల్స్ లో యాడ్స్ ఇవ్వడమే కాకుండా అనుష్క చేత ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించి ఇంటర్వ్యూలు ఇప్పించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.
అయితే ఈవిషయంలో అనుష్క వ్యూహం మరోలా ఉంది అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు అనుష్క ఈమూవీని చూడండి అంటూ చిన్నచిన్న వీడియో బైట్స్ ఇవ్వడానికి ఆశక్తి కనవరుస్తోంది కానీ ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఛానల్స్ కు పత్రికలకు ఇవ్వడానికి పెద్దగా ఆశక్తి కనపరచడం లేదని టాక్.
దీనితో ఈవిషయమై అనుష్కను ఏవిధంగా ఒప్పించాలి అన్న కోణంలో అమెజాన్ సంస్థ ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు లీకులు వస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీ ప్రారంభంలో ఈపాత్రను తాప్సీతో చేయించాలని అనుకున్నారట. అయితే ఎందుకో తాప్సీ ఈమూవీ కథ పై పెద్దగా ఆశక్తి కనపరచక పోవడంతో అనుష్క రంగంలోకి వచ్చింది అని అంటారు.
ఈమూవీలో అనుష్క మూగ పాత్ర చేస్తున్న పరిస్థితులలో కేవలం చేతి వేళ్లతో ముఖ కవళికలతో తన భావాలు పలికిస్తూ నటించాలి. దీనికోసం ఆమె ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ లో కోచింగ్ తీసుకోవడమే కాకుండా డంబ్ అండ్ డెఫ్ స్కూల్స్ కు వెళ్ళి అక్కడ టీచర్ లు తమ పిల్లలకు ఎలా సైగలతో ఎలా పాఠాలు చెపుతారు అన్నవిషయం పరిశీలించడానికి చాలసమయం ఆస్కూల్స్ లో కాలం గడిపిందట. ఇలాంటి కమిట్మెంట్ ఉంది కాబట్టే అనుష్క ‘అరుంధతి’ లో ‘సైజ్ జీరో’ లో ‘బాహుబలి’ ‘భాగమతి’ సినిమాలలో చేసిన పాత్రలకు విపరీతమైన పేరు వచ్చింది. మరి ‘నిశ్శబ్దం’ కథ వదులుకున్నందుకు తాప్సీ బాధ పడుతుందా లేదా అన్నది ఈమూవీ ఫలితం బట్టి తెలుస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి