స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో తెలిసిందే. తన వ్యక్తిగత, జీవితాలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటాడు. అలాగే తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను కూడా తరచుగా పోస్ట్ చేస్తుంటాడు.ఇప్పటికే బన్నీ తన పిల్లలకు సంబంధించిన ఎన్నో వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలలో షేర్ చేసి.. వాటిని తన అభిమానులతో పంచుకొంటూ వస్తున్నాడు..

ఇదిలా ఉంటె నిన్న దసరా పండగ సందర్భంగా కొందరు హీరోల సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలై సోషల్ మీడియాలో సందడి చేసాయి. అయితే దీనికి కొంచం భిన్నంగా మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తన కుటుంబం తో కలిసి దసరా రోజున పండుగ ప్రత్యేక దుస్తులతో దర్శనమిచ్చారు. దానితో  దసరా పండుగ అంతా అల్లు అర్జున్‌ కుటుంబంలోనే కనబడుతుంది. స్టైలిష్‌ స్టార్‌ అల్లు తన భార్య, పిల్లలతో కలర్‌ ఫుల్‌గా ఉన్న ఫొటోలను బన్నీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ ఫొటోలలో బన్నీ పిల్లలు అయాన్, అర్హలు ఎంతో క్యూట్‌గా ఉన్నారు. ఏ పండుగ అయితే ఆ పండగ వేషధారణలో ఈ మధ్య అయాన్, అర్హలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

 ఈసారి పిల్లలతో కలిసి స్నేహ, అల్లు అర్జున్‌ కూడా దర్శనమివ్వడంతో మెగాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. దసరా శుభాకాంక్షలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు 'పుష్ప' కోసం ఎంతగానో వెయిట్‌ చేస్తున్న అభిమానులకు కూడా బన్నీ తన తాజా లుక్‌లో కనిపించి మంచి ట్రీట్‌ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన ధరించిన డ్రస్‌ కూడా వార్తలలో నిలుస్తుండటం విశేషం.ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప'సినిమా లో నటిస్తున్నాడు.బన్నీ.ఈ సినిమా పాన్ ఇండియా కేటగిరీలో రూపొందుతుంది.తెలుగు తో పాటు మరో నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. నవంబర్ నెలలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేయనుంది చిత్ర యూనిట్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: