పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తుండగా ఆయనకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి హిట్ అందుకున్న పింక్ అనే మూవీకి అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ వకీల్ సాబ్ మూవి లో నివేద థామస్, అంజలి, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుండి బయటకు వచ్చిన మగువ మగువ అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్ తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సైతం ప్రేక్షకులు అలానే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుని ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది.
చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. దీనికోసం ఒక భారీ కోర్టు సెట్ ని కూడా వేసినట్లు సమాచారం. దాదాపుగా రెండున్నరేళ్ల తరువాత పవర్ స్టార్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా తారస్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా రాబోయే దీపావళి పండుగ నాడు ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయడానికి మూవీ నిర్మాతలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ డేట్ ని పలువురు డిస్ట్రిబ్యూటర్లకు బయ్యర్లకు వెల్లడించారట దర్శకనిర్మాతలు. అలాగే దీనికి సంబంధించి అతి త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే మాత్రం ఇది నిజంగా పవన్ ఫ్యాన్స్ కు పెద్ద పండుగ వార్త అని చెప్పాలి....!!

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి