బిగ్ బాస్ సీజన్ 4లో సండే స్పెషల్ ఎపిసోడ్ లో కన్నడ స్టార్ హీరో సుదీప్ ఎంట్రీ సర్ ప్రైజ్ చేసింది. సీజన్ 4లో ఇప్పటికే చాలా సర్ ప్రైజులు ప్లాన్ చేసిన బిగ్ బాస్ టీం షో ముగుస్తున్న టైం లో మరింత ఆసక్తి పెంచేలా వీకెండ్ ఎపిసోడ్స్ క్రేజీగా ప్లాన్ చేశారు. దసరా స్పెషల్ ఎపిసోడ్ కు సమంత హోస్ట్ గా చేసి అలరించగా లేటెస్ట్ గా సుదీప్ హోస్ట్ గా షాక్ ఇచ్చాడు.

విశేషం ఏంటంటే కన్నడలో బిగ్ బాస్ హోస్ట్ గా సుదీప్ చేస్తున్నారు. సో ఈ సర్ ప్రైజ్ ఎవరు ఊహించలేదు. అయితే సండే ఫన్ డే కాబట్టి సుదీప్ హౌజ్ మేట్స్ తో సరదాగా సాగేలా ఈ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. అయితే ఈ వారం స్పెషల్ ఎంట్రీ ఇవ్వడానికి కారణం టికెట్ టూ ఫినాలే అభ్యర్ధిని ఎనౌన్స్ చేయడానికే అని అంటున్నారు.

ఈ వారం నలుగురు నామినేషన్స్ లో ఉండగా మోనాల్ ను నిన్న నాగ్ సేఫ్ చేశాడు. ఇక ఎటొచ్చి ముగ్గురు నామినేషన్స్ లో ఉన్నారు. అవినాష్ కు ఎలాగు ఎవిక్షన్ పాస్ ఉంది. ఇక మిగిలింది అఖిల్, అరియానా. ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి. అయితే ఈ వారం ఎలిమినేషన్ లేకుండా ఎవిక్షన్ పాస్ ద్వారా అవినాష్ సేఫ్ అవుతాడు కాబట్టి నో ఎలిమినేషన్ అంటారని తెలుస్తుంది. అంతేకాదు ఒకరికి టికెట్ టూ ఫినాలే పాస్ ఇచ్చేందుకు సుదీప్ వచ్చాడని అంటున్నారు.                                              

 

మరింత సమాచారం తెలుసుకోండి: