బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.... తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటికీ నిన్న మొన్నటి వరకు సౌత్ లో పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతం మన కుర్ర కారుకు హాట్ టాపిక్ గా మారింది ఈ హిందీ బామ. లవర్ బాయ్ విజయ్ దేవరకొండ సరసన నటిస్తుంది అని తెలియగానే ఆమె గురించి తెలుసుకోవడానికి  తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తోన్న పాన్ ఇండియా మూవీలో అనన్య పాండేను హీరోయిన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

ఇక అప్పటి నుండి ఈ భామ పెట్టే వర్కింగ్ స్టిల్స్ పెరిగాయి.... అలాగే వాటికి క్రేజ్ కూడా ఓ రేంజ్ లో పెరుగుతోంది. అనన్య ఫోటోలు అలా పోస్ట్ చేస్తే.... ఇలా రివ్వున ఎగిరి వైరల్ గా మారుతున్నాయి. అనన్య అందాలను ఆస్వాదించడానికి అంతగా ఆసక్తి చూపుతున్నారు విజయ్ ఫ్యాన్స్. తాజాగా చినుగుల వైట్ డెనిమ్ జీన్స్ .. టైట్ బ్రింజాల్ కలర్ టాప్ ధరించి డైనింగ్ టేబుల్ ముందు రిలాక్స్ అవుతూ కూర్చున్న ఫోటో యూత్ ను ఆకట్టుకుంటోంది. అయితే ఆమె పక్కనే తన పెట్ డాగ్స్ కూడా ఎంతో క్యూట్ గా కనిపిస్తూ ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. బహుశా ఇది ఆమె తన పెట్ డాగ్స్ తో టైం స్పెండ్ చేస్తున్న  సమయంలో దిగిన ఫోటో కావచ్చు. ఏదేమైనా అమ్మడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఇప్పట్లో  ఆగేలా లేదు.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో నటించిన అనన్య ఇప్పటికిప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అందులోనూ విజయ్ సరసన ఛాన్స్ దొరకడంతో మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. మరి ఈ బాలీవుడ్ బబ్లీ గర్ల్ టాలీవుడ్ లో ఫుల్ టైం హీరోయిన్ గా సెటిల్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: