బిగ్ బాస్ సీజన్ 4లో అఖిల్ మొదటి ఫైనలిస్ట్ గా సెలెక్ట్ అయ్యాడు. టికెట్ టు ఫినాలే రేసులో అఖిల్ విన్నర్ గా నిలవడంతో అతనే మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. అయితే మెడల్ వేసుకునేందుకు ఈ వీక్ నామినేషన్స్ నుండి సేఫ్ కావాల్సి ఉంది కాబట్టి శనివారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున వచ్చి నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో మొదట అఖిల్ నే సేఫ్ చేశాడు. ఇక ఆ తర్వాత టికెట్ టు ఫినాలే మెడల్ ను బాహుబలి బ్యాక్ గ్రౌండ్ వేసి మరి సోహెల్ అఖిల్ మెడలో వేశాడు.

ఆ టైం లో మోనాల్, హారిక అఖిలే నంబర్ 1 అంటూ అరవడం క్రేజీగా మారింది. అయితే ఎప్పుడు అభిజిత్ కు సపోర్ట్ గా ఉండే హారిక సడెన్ గా అఖిల్ తో ఫ్రెండ్ షిప్ బిల్డ్ చేసుకుంటుంది. అలా ఎందుకు అంటే లాస్ట్ వీక్ నాగ్ ఇచ్చిన షాక్ కు హారిక అభిజిత్ ను దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. తనతో ఉండాల్సినంత క్లోజ్ గా ఉండట్లేదని హారికతో కొద్దిగా డిస్టన్స్ మెయింటైన్ చేస్తున్నాడు అభిజిత్. ఇవే కారణాలు అభిజిత్, హారిక దూరమయ్యేలా చేశాయి.

ఇక అఖిలే నంబర్ 1 అంటూ మొదటి ఫైనలిస్ట్ గా మెడల్ అందుకున్నా సరే సోహెల్ త్యాగం వల్లే అతను మెడల్ గెలుచుకున్నాడు అని నాగార్జున కూడా చెప్పాడు. ఇదో రకంగా అఖిల్ కు మైనస్ అవుతుందని చెప్పొచ్చు. అఖిల్ మొదటి ఫైనలిస్ట్ అయినా కూడా విజేతగా మాత్రం అతనికి తక్కువ ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఫినాలే రేసులో ఎవరెవరు ఉంటారు.. వారిమధ్య ఎలాంటి ఫైట్ జరుగుతుంది అన్నది వేచిచూడాలి.                   

మరింత సమాచారం తెలుసుకోండి: