కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా సంక్షోభంలో కూరుకుపోయిన రంగం ఏదైనా ఉంది అంటే ముఖ్యంగా అది సినీరంగం చెప్పడంలో అతిశయోక్తి లేదు. కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన నాడు నిలిచిపోయిన సినిమా షూటింగులు ఇప్పటికి కూడా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు ఇప్పుడిప్పుడే షూటింగ్ ప్రారంభమవుతున్నాయి. అదే సమయంలో సినిమా థియేటర్లు ఇప్పటికీ పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చే  కొన్ని రోజుల ముందు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు థియేటర్లు తెరుచుకోకపోవడంతో ప్రస్తుతం విడుదల ఆగిపోయాయి.


 కొన్ని సినిమాలు ఓటీటీ వేదికగా విడుదల అయినప్పటికీ మరికొన్ని సినిమాలు మాత్రం ఇప్పటికీ ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లు తెరుచుకుంటాయా  అని ఎదురుచూస్తున్నారు.  అయితే పెళ్లిచూపులు సినిమాలో  తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తెలుగు అమ్మాయి రీతు వర్మ... ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ మలయాళ సినిమాల్లో కూడా నటిస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక తమిళంలో దుల్కర్ సల్మాన్ తో చేసిన  సినిమా ఘన విజయం సాధించడంతో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.



 అయితే ఈ ఏడాది కరోనా  వైరస్ కారణంగా తాను ఎంతగానో నష్టపోయా అని చెబుతుంది రీతువర్మ.  ఏడాది తొలి రెండు నెలలు షూటింగ్లతో ఎంతో బిజీగా గడిచిపోయింది.. ఇక ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో చేసిన సినిమా మంచి విజయం సాధించడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయని..  ఈ క్రమంలోనే 2020 సంవత్సరం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయని ఆ సినిమాలు మొత్తం ఈ  ఏడాది విడుదల కావాల్సినవే  అంటూ చెప్పుకొచ్చింది.కానీ కరోనా  కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో ఈ ఏడాది తనకు నిరాశే మిగిలింది అంటూ చెప్పుకొచ్చిందిహీరోయిన్ రీతూ వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: