ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ మంచి ఫాం లో ఉన్నాడు బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల ఫ్లాప్ తర్వాత శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను సినిమాల హిట్లతో సూపర్ సక్సెస్ లో ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ స్నిమా తర్వాత మురుగదాస్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని టాక్. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ అయిన మురుగదాస్ అక్కడ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేయాలని అనుకున్నాడు కాని అది కుదరలేదు.
విజయ్ కు కథ నచ్చక సినిమా రిజెక్ట్ చేశాడట. అయితే ప్రస్తుతం మురుగదాస్ శివ కార్తికేయన్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మహేష్ కోసం ఓ అదిరిపోయే కథ రెడీ చేశాడట మురుగదాస్. ఆ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. మహేష్ తో సినిమా అంటే అది మాములు విషయం కాదు. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ చేయబోయే సినిమాల మీద ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి