రామ్ చరణ్ ఆచార్యలో సుమారు ఆరగంట నుంచి నలభై నిమిషాల మధ్యలో కనిపించే అవకాశాలు ఉన్నాయట.ఈ సినిమా ని సంక్రాంతి తర్వాత రిలీజ్ చేయాలనీ చూస్తుండడంతో RRR ఆచార్య రెండు చిత్రాలమీదే చరణ్ కాన్సంట్రేట్ చేస్తున్నాడని అంటున్నారు. ఇకపోతే ఆచార్య సిద్ధకు జోడి ని ఎంపిక చేశారు చిత్ర బృందం..సిద్దాకు జోడిగా హీరొయిన్ పూజా హెగ్డే దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే.
దీని గురించి చాలా రోజులుగా ఏవేవో పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ముందు రష్మిక మందన్న అన్నారు. తర్వాత మళ్ళీ అంతా సైలెంట్. కొంతకాలం కీయరా అద్వానీ, రాశి ఖన్నాల గురించి న్యూస్ వచ్చాయి. కానీ అవేవి నిజమా కాదా అనే నిర్ధారణ యూనిట్ ఇవ్వలేదు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా తెలిసింది. గతంలో రంగస్థలంలో జిగేలు రాణిగా ఐటెం సాంగ్ లో మెరిసిన పూజా హెగ్డే ఇప్పుడున్న స్టార్ లందరి సరసన ఫుల్ లెంత్ హీరొయిన్ గా చేసింది కానీ ఒక్క చరణ్ మాత్రమే బాలన్స్ ఉన్నాడు. ఇప్పుడు ఆచార్యతో ఆ కొరత కూడా తీరబోతోంది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి