ప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘ఆది పురుష్’ ‘సలార్’ మూవీలు రెండు కూడా పాన్ ఇండియా మూవీలు. ఈ రెండు మూవీలు విడుదలైన తరువాత ప్రభాస్ రేంజ్ టాప్ బాలీవుడ్ హీరోల స్థాయిని మించి పోతుందని అంచనాలు వస్తున్నాయి. దీనితో ఈ రెండు సినిమాల విడుదల గురించి ప్రభాస్ అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.


ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్  దర్శకత్యం వహిస్తున్న  ‘ఆదిపురుష్’ మూవీ గురించిన వార్తలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్స్ అవుతున్నాయి. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మింపబడుతున్న ఈ మూవీ గురించి ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో   దర్శకుడు ఓం రౌత్ అనేక ఆసక్తికర విషయాలు తెలియచేసాడు.



మొదటగా తనకు ఈ సినిమా ఆలోచన వచ్చినప్పుడే ప్రభాస్ హీరో అని ఫిక్స్ అయిపోయిన విషయాన్ని వివరిస్తూ ప్రభాస్ ఈ సినిమాను ఒప్పుకోకపోయి ఉంటే ‘ఆదిపురుష్’ మూవీ ప్రాజెక్ట్ ఉండేదికాదు అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ఈమూవీకిసంబంధించి కౌసల్య పాత్రకు  హేమమాలిని ఎంపిక అయినట్లుగా ఓం రౌత్ లీకులు ఇస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఈనెల ప్రారంభంలో ‘ఆదిపురుష్’ షూటింగ్ ప్రారంభం రోజున షూటింగ్ స్పాట్ లో భారీ అగ్నిప్రమాదం జరగడడంతో త్రీడి టెక్నాలజీకి చెందిన ఆధునిక సాంకేతిక పరికరాలు ఈప్రమాదంలో బాగా దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది.    


ఈ భారీ అగ్ని ప్రమాదం కారణంగా సాంకేతిక పరికరాలతో పాటు  చాలా ఖరీదైన  కాస్ట్యూమ్స్ అన్ని మంటలలో కాలిపోయాయని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనితో ఈసాంకేతిక పరికరాలను విదేశాల నుంచి తెప్పించి మళ్లీ భారీ సెట్ వేసి షూటింగ్ ప్రారంభించడానికి చాలసమయం పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా ‘ఆదిపురుష్’ షూటింగ్ ఇప్పట్లో ప్రారంభంకాదని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. దీనితో ప్రభాస్ ‘ఆదిపురుష్’ డేట్స్ ‘సలార్’ సినిమాకు సెట్ చేసే విధంగా తన యాక్షన్ ప్లాన్ మార్చాడని టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: