కరోనా మహమ్మారి ఇప్పటికే ఎందరో ప్రముఖులన్ని మనకు దూరం చేసింది. ఎన్నో జీవితాలను అతలాకుతులం చేసింది. సామన్యుడి నుంచి ప్రముఖుల వరకూ కరోనా ఎవర్ని వదలలేదు. ఎందరో నటినటులు, గాయకులు కరోనా బారిన పడ్డారు. కొందరు ప్రాణాలను విడిచారు. ఈ మహమ్మారి వల్ల ఎస్పీ బాలసుబ్రమణ్యం లాంటి ప్రముఖ గాయకుడిని మనం కోల్పోయాం. అది మరువక ముందే పంజాబ్ ఫేమస్ సింగర్ కూడా వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు. కోవిడ్ తగ్గుతుంది, వాక్సిన్ వచ్చేస్తుందని వార్తలు వినిపిస్తున్నా.. కరోనా పంజా మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. రోజులో ఎక్కడో ఓ చోట కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

తాజాగా పంజాబ్ ప్రముఖ సింగ‌ర్ శార్దూల్ సికింద‌ర్ క‌రోనాతో పోరాడుతూ మరణించారు. కొన్ని రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ ప‌డుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను మొహాలీలోని ఫోర్టిస్ ఆస్ప‌త్రిలో జాయిన్ చేయించారు కుటుంబ సభ్యులు. కిడ్నీ ఆపరేషన్ విజయవంతం అయినప్పటికీ సికిందర్‌కు కరోనా సోకింది. ఈ క్ర‌మంలోనే చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24 ఉద‌యం తుదిశ్వాస విడిచాడు.

పంజాబ్‌లో శార్దుల్ మంచి పేరు ప్రఖ్యాతలు గాడించాడు. శార్ధుల్ మృతి పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, శిరోమణి అరాలీదళ్ ప్రెసిడెంట్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సంతాపం తెలిపారు. శార్దూల్ సికింద‌ర్‌.. పంజాబీ లాంగ్వేజ్ ఫోక్ సింగర్‌, పాప్ సింగ‌ర్‌. 1980లో ఆయ‌న రోడ్‌వేస్ ది లారీ పేరిట‌ మొద‌టి ఆల్బ‌మ్‌ను విడుద‌ల చేశారు. ఆ త‌ర్వాత శార్దూల్‌కు మంచి పాపులారిటీ వ‌చ్చింది. మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు. న‌ట‌నలో కూడా మంచి గుర్తింపు సాధించారు. జ‌గ్గా ద‌కురా మూవీలో శార్దూల్ నటన అందరిని కట్టిపడేసింది. పంజాబ్ వాసులు గొప్ప సింగ‌ర్‌, న‌టుడిని కోల్పోయార‌ని వెల్లడించారు. ఆయ‌న మ‌ర‌ణం పంజాబీ ఫిలిం ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు అని తెలిపారు .

మరింత సమాచారం తెలుసుకోండి: