సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా, కమెడియన్స్ గా సుమారు 100 చిత్రాలకు పైగా నటించి, రికార్డులను సృష్టిస్తుంటే, ఇక మన హీరోలు కూడా 100 చిత్రాలకు పైగా కేవలం హీరోగా మాత్రమే నటించి, ప్రభంజన సునామీ సృష్టిస్తున్నారు.. అయితే ఎవరెవరు 100 సినిమాలకు పైగా హీరోగా నటించారో..?ఇప్పుడు తెలుసుకుందాం ...

1. మోహన్ బాబు :
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఏకంగా 560 సినిమాలలో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టు గా ఆకట్టుకున్నాడు.  తన నటనకు ఎన్నో అవార్డులు,పురస్కారాలు కూడా లభించాయి..


2. కృష్ణ :
సూపర్ స్టార్ కృష్ణ తన నటనతో అందర్నీ ఆకట్టుకునే వాడు. అలా కేవలం యాక్షన్ సినిమాలను మాత్రమే పరిమితం కాకుండా ఫ్యామిలీ సినిమాలను కూడా తీసి ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా చేసుకున్నాడు. కృష్ణ 345 పైగా సినిమాలలో అనేక పాత్రల్లో నటించి, ప్రేక్షకులను అబ్బుర పరిచాడు..


3.  ఎన్టీఆర్:
ఎన్టీఆర్ పేరు టాలీవుడ్ లో వినగానే ఒక ఊపు వచ్చేది. ఈయన కేవలం హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా కూడా రాణించాడు. ఈయన మొత్తం 303 సినిమాలలో నటించి, ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసాడు..

4. అక్కినేని నాగేశ్వరరావు :
256 సినిమాల్లో ఆయన నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అంతే కాకుండా నిర్మాతగా కూడా మంచి సినిమాలను మనకు అందించాడు.

5. చంద్రమోహన్ :
చంద్రమోహన్ హీరో గా,  కమెడియన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమారు 500 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు..

6. కృష్ణంరాజు :
190 సినిమాలలో కృష్ణంరాజు నటించి,  మాస్ ని ఆకట్టుకునే పాత్రలే ఎక్కువగా నటించాడు. అంతేకాకుండా ఈయన మొట్టమొదటి నంది అవార్డు గ్రహీత గా కూడా పేరు ప్రఖ్యాతులు ఘడించారు.

 7.  చిరంజీవి:
చిరంజీవి ఇటీవల తన 150 వ చిత్రంగా ఖైదీనెంబర్150 అత్యంత కలెక్షన్లను రాబట్టింది. ఇక అంతటితో ఆగకుండా మరో మూడు సినిమాలను చేస్తున్నాడు చిరంజీవి..

వీరే కాకుండా శ్రీకాంత్, శోభన్ బాబు,నందమూరి బాలకృష్ణ, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎంతో మంది సుమారు వందకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: