సాధారణంగా ఒక్క వారంలో రెండు లేక మూడు సినిమాలు విడుదల అవుతుంటాయి కానీ మార్చి మొదటి వారంలో ఏకంగా 14 మూవీలు రిలీజ్ అవుతున్నాయి. కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో పాటు ఎండాకాలం ప్రారంభం కాగా సినిమాలన్నీ కూడా రిలీజ్ కి క్యూ కడుతున్నాయి. ఏప్రిల్ నెలలో వెంకటేష్ దృశ్యం 2, నాని టక్ జగదీష్, నాగార్జున వైల్డ్ డాగ్ వంటి భారీ సినిమాలు రాబోతున్నాయి కాబట్టి చిన్నాచితకా సినిమాలన్నీ కూడా మార్చి నెలలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ వారంలో 14 సినిమాలు విడుదల కావడం విశేషం. అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


హాకీ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో కిచ్చ సుదీప్, లావణ్య త్రిపాటి తారాగణంతో రూపొందిన ఏ వన్ ఎక్స్ప్రెస్ సినిమా మార్చి 5వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సినిమాకి డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహించారు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ పవర్ ప్లే సినిమా కూడా అదే తేదీన విడుదల కానుంది. మొగలిరేకులు సీరియల్ ఫేమ్ సాగర్ హీరోగా నటించిన రొమాంటిక్ డ్రామా షాది ముబారక్ సినిమా కూడా మార్చి 5న విడుదల కానున్నది. నితిన్ ప్రసన్న, ప్రీతి అశ్రాణి హీరో హీరోయిన్లుగా నటించిన స్మాల్ టైం థ్రిల్లర్ "A" సినిమా కూడా ఈ వారంలోనే విడుదల కాబోతోంది. తారకరత్న, సురేష్ కొండేటి కాంబోలో రూపొందిన దేవినేని సినిమా కూడా ఈ వారంలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నది.


ప్లేబ్యాక్, తోటబావి, క్లైమాక్స్, శ్రీ పరంధామయ్య గారి శిష్యులు కథ వంటి సినిమాల ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిన్నపాటి సినిమాలన్నీ కూడా ఈ వారంలోనే రిలీజ్ కావడం విశేషం. మార్చి 5న డబ్బింగ్ చిత్రాలైన గజకేసరి, విక్రమార్కుడు, ఖోస్ వాకింగ్, జుడాస్ & బ్లాక్ మెస్సీయ, రాయ, ది లాస్ట్ డ్రాగన్ విడుదలవుతున్నాయి. కేవలం ఒకే ఒక్క వారంలోనే 14 సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా కనీస వసూళ్లు కూడా రాబట్టలేక చిత్తవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: