మోనాల్ , అఖిల్ ఈ పేర్లకు మంచి బంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే.. బిగ్ బాస్ షోలో వీళ్ళు చేసిన అల్లరి, అంతకు మించి రొమాన్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్లకు ఉన్న క్రేజ్ ఇంకాస్త పెరిగింది. లవర్స్ అనే ముద్ర వేసుకున్న వీరిద్దరూ ఎక్కడకు వెళ్లినా కూడా అదే రెస్పాన్స్, వస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా ఇప్పుడు వీరు తీసుకున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.


బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మోనాల్ గజ్జర్.. మొదట అభిజీత్‌తో క్లోజ్‌గా ఉంటూ వచ్చింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చనువుగా ఉండడం ప్రారంభించింది. దీంతో వీళ్ల మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అభిజీత్‌ను పూర్తిగా దూరం పెట్టేసిన మోనాల్.. అఖిల్‌కు మాత్రం మరింత దగ్గరైపోయింది. షో మొదట్లో అభిజిత్ తో తెగ తిరిగేదు. వంద రోజుల పాటు జంటగా హల్‌చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తీరుదతో వార్తల్లో నిలుస్తున్నారు. తరచూ కలవడం.. జంటగా పార్టీలు చేసుకోవడం వంటి వాటిని చేసుకోవడం చేస్తున్నారు.


అయితే వీరు ఖాళీ సమయం దొరికితే చాలు బయట తెగ తిరిగేవారు.తాజాగా మరోసారి కలిసింది. ఈ విషయాన్ని వీళ్లిద్దరూ తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. అంతేకాదు, దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా వదిలారు. వీటిలో ఈ బిగ్ బాస్ జంట బాగా దగ్గరగా ఉండటం విశేషం..ఎప్పటి లాగా కాకుండా ఈ మీటింగ్ కాస్త వేరే లెవెల్ లో ఉంది.సంబంధించిన వీడియోను అఖిల్ సార్థక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ఓ అద్దం ముందు నిల్చుని వీళ్లిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. చాలా దగ్గరగా ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని అందులో కనిపించారు. అయితే, ఆ సమయంలో మోనాల్ గజ్జర్ సిగ్గుతో తల దించుకుంది.. అఖిల్ వెనుక దాక్కుంది.. ఫన్నీ గా ఉన్న ఈ వీడియో  సోషల్ మాధ్యమాల్లో ట్రెండ్ అవుతుంది.. మీరు ఒకసారి చూడండి..

మరింత సమాచారం తెలుసుకోండి: