ఇటు రాజకీయ అంశాలకు సంబంధించిన ఒత్తిడి.. మరో వైపు అనారోగ్య సమస్యతో గత కొద్ది రోజులుగా షూటింగ్ కి దూరంగా ఉండి పోయారు సూపర్ స్టార్ రజనీకాంత్. అయితే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ చేశారు తలైవా. కాగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న 'అన్నాత్తే'  సినిమా షూటింగ్ సమయంలో తన అనారోగ్య సమస్య వలన... షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన రజనీకాంత్ ఇప్పుడు తన ఆరోగ్యం కుదుట పడడంతో... తిరిగి మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. దీనితో అభిమానులకు కొత్త జోష్ వచ్చేసింది.

హైదరాబాద్‌లోని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక నేరుగా చెన్నై వెళ్ళిన రజనీ.. అక్కడే రెస్ట్  తీసుకుని ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఇకపై బ్రేక్ లేకుండా సినిమాలు పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. అంతేకాదు డైరెక్టర్ శివ కు ఫోన్ కాల్ చేసి మరీ తిరిగి షూటింగ్ ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారట. దీంతో దర్శకుడు శివ షూటింగ్ కి కావాల్సిన కార్యక్రమాలను చక చకా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. చిత్రంలో నటిస్తున్న మిగిలిన నటీనటులకు షూటింగ్ షెడ్యూల్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు.

ప్రముఖ దర్శకుడు శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో... నయనతార రజనీకాంత్ సరసన హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, మీనా, సిమ్రాన్ కూడా నటిస్తుండడం విశేషం. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు చివరి దశకు చేరుకోగా.... మిగిలిన షూటింగ్ ఇప్పుడు శర వేగంగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్. ముందుగా అనుకున్న ప్రకారం నవంబర్ 4, 2021న ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. మరి అతి త్వరలోనే ఈ సినిమా పూర్తయ్యి మన ముందుకు రావాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: