ఇక ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లు తిరుగులేని హీరోలుగా వెలిగిపోతుంటే వారితో సమానమైన స్థాయిలో హీరోగా నిలబడిన ఏకైక నటుడు కాంతారావు. కత్తి పట్టిన జానపద వీరుడంటే ఇప్పటికీ మనకు గుర్తుకు వచ్చేది కాంతారావే. తెలుగు చిత్రసీమలో రాముడు, కృష్ణుడు పాత్రలంటే ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తాడో... నారద పాత్రలకు కాంతారావు అంతే పేరు సాధించాడు. కేవలం నారద పాత్రలే కాదు.. రాముడు, కృష్ణుడు, ఇంద్రుడు మొదలైన పౌరాణిక పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసారాయన.
అయితే సినిమా అవకాశాల కోసం ఎన్నో కష్టాలు అనుభవించిన కాంతారావు టాకీ పులి హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రతిజ్ఞ’తో హీరోగా పరిచయం అయ్యారు. ‘ప్రతిజ్ఞ’తర్వాత.. కాంతారావు వెనుదిరిగి చూసుకోలేదు. విఠలాచార్య తొలి తెలుగు చిత్రం ‘కన్యాదానం’ నుంచి వీరిద్దరి అనుబంధం మొదలై... అలా కొనసాగుతూ వచ్చింది. దాదాపు 500 చిత్రాలలో ఆయన నటించారు. కాంతారావు నటనా పటిమా తెలుగు చిత్రాల వరకే పరిమితం కాలేదు. కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో నటించి అక్కడి వారి ప్రేక్షకాభిమానం సైతం పొందిన ఘనత కాంతారావుది. మలయాళంలో ‘భక్త కుచేల’ లో కృష్ణుడిగా నటించి.. కణ్ణన్‌గా ప్రశంసలు పొందాడు.
ఇక వయస్సు పై బడిన తర్వాత.. కాంతారావుకు హీరో వేషాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. కేవలం కథానాయకుడిగానే కాకుండా.. కాలానుగుణంగా వివిధ పాత్రలు పోషించాడాయన. అగ్ర హీరోల సరసన మరో అగ్ర నటుడిగా వెలుగొందిన ఆయన.. ఆస్తుల విషయానికి వస్తే, ఆ స్థాయిలో కూడబెట్టలేదనే చెప్పాలి. కాంతారావు సంపాదించిన అమూల్యమైన ఆస్తి ఏదైనా వుందంటే అది ప్రజాభిమానమే. న్టీఆర్, ఏఎన్నార్ల సరసన నిలచిన హీరోగా పేరు సాధించాడు. అయినా కాంతారావు పట్ల చిత్రపరిశ్రమ నిర్లక్ష్యవైఖిరి అవలంబించింది. ఇక్కడ మాములు ఆర్టిస్టులకు సొంత ఇల్లు ఉన్న ఇండస్ట్రీలో... తెలుగు చిత్రసీమలో నెంబర్ వన్ హీరోలకు పోటీ ఇచ్చిన కాంతారావుకు కనీసం సొంత ఇల్లు కూడా లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి