మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై రూపొందుతున్న తాజా సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి తిరు ఫోటోగ్రఫీని అందిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్ రికార్డింగ్ అంతా పూర్తయిందని అతిత్వరలో ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుందని సమాచారం.

మరోవైపు కొన్నాళ్ళ క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కి మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన లభించింది. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ ఆచార్య అనే మాజీ నక్సలైట్ పాత్ర పోషిస్తుండగా ఆయన అనుచరుడైన కామ్రేడ్ సిద్ద పాత్రలో చరణ్ కనిపించనున్నట్లు టాక్. ఇక ఈ మూవీ ఈ ఏడాది మే 28న రిలీజ్ కానుంది. అయితే దీని తర్వాత లూసిఫర్ మూవీ తెలుగు రీమేక్ లో మెగాస్టార్ నటించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

ఇక దీని తర్వాత బాబి దర్శకత్వంలో మెగాస్టార్సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అందుతున్న సమాచారాన్ని బట్టి ఆ మూవీ పోలీస్ స్టోరీగా పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని అంటున్నారు. గతంలో రవితేజ హీరోగా బాబీ తీసిన పవర్ మూవీ మాదిరిగా ఈ మూవీ కూడా కొంత అదేవిధమైనా పంథాలో సాగనుందట.  అలానే ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా బాబి ఈ మూవీ కథని ఎంతో అద్భుతంగా రాసుకున్నారని చెబుతున్నారు. మరి ఇదే కనుక నిజమైతే అది త్వరలో మెగాస్టార్, బాబీ కాంబినేషన్లో ఒక పవర్ఫుల్ హిట్ మూవీ లభించినట్లే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: