ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం నవ్వులకు చిరునామా గా మారిపోయింది. ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది జబర్దస్త్.  ఇకపోతే జబర్దస్త్ లో ఎప్పుడూ ఏదో ఒక జంట హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు సుడిగాలి సుధీర్ రష్మీ హాట్ టాపిక్ గా మారిపోయింది ఇక ఈ జంట ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత హైపర్ ఆది అనసూయ జంట కూడా అటు ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లో మరో సరికొత్త జంట ప్రేక్షకులను ఆకర్షిస్తుంది అన్న విషయం తెలిసిందే.



 వర్ష ఇమాన్యుల్ జంట ప్రస్తుతం జబర్దస్త్ లో అందరినీ ఆకర్షిస్తూ ఎంతగానో క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతుంది.  ఒకప్పుడు రష్మీ సుధీర్ జంట ఎలాగైతే ఫేమస్ అయిందో ఇప్పుడు కూడా వర్ష ఇమ్మానియేల్ జంట అదే పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ టీవీ లో ఏ కార్యక్రమంలో చేసిన ఇద్దరే స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిపోతున్నారు అయితే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నిజంగానే పెళ్ళి చేసుకున్నారు అని తెలుస్తోంది.  ఏంటి ఆశ్చర్య పోతున్నారు కదా.


 వీరిద్దరూ పెళ్లి చేసుకుంది నిజజీవితంలో కాదు ఇటీవల జబర్దస్త్ స్కిట్ లో భాగంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కెవ్వు కార్తిక్ స్కిట్ లో భాగంగా వర్ష ఇమాన్యుల్ ఇద్దరూ కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు గెటప్ లో వచ్చారు.  వీరిని ఆశీర్వదించడానికి జబర్దస్త్ లో ఉన్న కమెడియన్స్ అందరూ వచ్చారు. ఈ క్రమంలోనే పెళ్లి డ్రెస్ లో వచ్చిన ఇద్దరు జంట తమదైన శైలిలో కామెడీ చేసి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: