లోకేష్ కనగరాజ్ విజయ్, విజయ్ సేతుపతిలతో తెరాకెక్కించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ .. 'మాస్టర్' ను కూడా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో రీమేక్ చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు.ఇక సూర్య నటించిన మాస్టర్ పీస్ ఆకాశం నీ హద్దురా ఓటిటిలో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ మూవీ కూడా బాలీవుడ్లో రీమేక్ కాబోతుంది.ఇక అలాగే బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి మూవీ కూడా బాలీవుడ్లో రీమేక్ కాబోతుంది.ఇక రామ్- పూరి కాంబినేషన్లో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' ను కూడా బాలీవుడ్లో రీమేక్ చెయ్యబోతున్నారు.ఎన్టీఆర్ -సురేంద్ర రెడ్డి కాంబినేషన్లో వచ్చిన యావరేజ్ మూవీ ఊసరవెల్లిని కూడా బాలీవుడ్లో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ 'అల వైకుంఠపురములో'..! దీనిని కూడా బాలీవుడ్లో రీమేక్ చెయ్యబోతున్నారు.
ఇక నేషనల్ అవార్డుని సాధించిన 'జెర్సీ' మూవీ హిందీ షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ కాబోతుంది.11 ఏళ్ళ తరువాత ఈ బ్లాక్ బస్టర్ మూవీ అరుంధతి హిందీలో రీమేక్ కాబోతుంది. అల్లు అరవింద్ గారు ఈ చిత్రాన్ని అక్కడ రీమేక్ చెయ్యబోతున్నారు.నవీన్ పోలిశెట్టి నటించిన ఔట్ అండ్ ఔట్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్ మూవీ 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' కూడా హిందీలో రీమేక్ కాబోతుంది.ఇక అలాగే దువ్వాడ జగన్నాథం- డిజె,భాగమతి, హిట్, టాక్సీవాలా,మత్తు వదలరా,ఎఫ్2,బ్రోచేవారెవరు సినిమాలతో పాటుగా కార్తీ నటించిన సూపర్ హిట్ మూవీ 'ఖైదీ' కూడా హిందీలో అజయ్ దేవగన్ హీరోగా రీమేక్ కాబోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి