పొలిటికల్ ఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ బిగ్ స్క్రీన్‌పై కనిపిస్తుండటంతో అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి అన్నీ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. అభిమానులు, ప్రేక్షకులతో థియేటర్లు నిండిపోయాయి. అయితే సినిమాపై ప్రేక్షకుల హైప్ ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్ర యూనిట్‌కు పలువురు సినీ ప్రముఖులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టాలని కోరుకుంటున్నారు.

అయితే తాజాగా బాలీవుడ్ నటి ఆలియా భట్ వకీల్ సాబ్ సినిమాపై స్పందించారు. అయితే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు తమ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ టీంకు ఆల్ ది బెస్ట్.. ఫ్యాన్స్ బీ రెడీ ఫర్ వకీల్ సాబ్’’ అని విష్ చేసింది.

కాగా, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఆలియాభట్ సీత పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్‌టీఆర్- కొమురం భీం, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్-అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆలియాభట్‌తోపాటు హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితోపాటు శ్రీయ, అజయ్ దేవ్‌గణ్, సుముద్రఖనీ, పలువురు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారు.
 
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇటీవల ఆలియాభట్ సీత పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: