అయితే ఆయనకు ధీటుగా వాదించే ప్రతివాది లాయర్ గా ప్రకాష్ రాజ్ కనిపించారు. థమన్ అదిరిపోయే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫి ని అందించారు. మాస్, క్లాస్, లేడీస్ ఇలా అన్ని వర్గాల ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు వేణు శ్రీరామ్ ఎంతో అద్భుతంగా సినిమా తీసారని, తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ మూవీ గత రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టి సరికొత్త సంచలనాన్ని నమోదు చేయడం ఖాయం అని పలువురు పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక ఈ సినిమా విజయం పై నేడు చిత్ర బృందంతో కలిసి ప్రత్యేకంగా సినిమా వీక్షించిన దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తొలిసారిగా తనకు ఎంతో ఇష్టమైన పవర్ స్టార్ ని డైరెక్ట్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, మూడేళ్ళ తరువాత ఆయన ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అదే విధంగా ఆయనను స్క్రీన్ పై ఆకట్టుకునేలా చూపడానికి తాను పడ్డ కష్టానికి నేడు తగిన ప్రతిఫలం లభించిందని, ఈ సినిమాని ఆదరిస్తున్న ఆడియన్స్ కి వేణు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పినట్లు తెలుస్తోంది.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి