టాలీవుడ్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నీళ్లు తాగినంత ఈజీగా రికార్డులు క్రియేట్ చేస్తాడని తెలుసు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడతాయి. ఇక పవర్ స్టార్ ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరో పక్క వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక దాదాపు మూడు సంవత్సరాల తరువాత "వకీల్ సాబ్ " సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పట్నుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు.బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన 'పింక్' కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసాడు. 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్ పై దిల్ రాజు, బోణి కపూర్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. శృతీ హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగెళ్ళ వంటి భామలు కూడా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రానికి హిట్ టాక్ లభించింది.


ఇక 2013 లో పవర్ స్టార్ నుండీ వచ్చిన ఇండస్ట్రీ హిట్ 'అత్తారింటికి దారేది' తరువాత ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు పవన్ కళ్యాణ్.అటు తరువాత వచ్చిన 'గోపాల గోపాల' యావరేజ్ కాగా 'సర్దార్ గబ్బర్ సింగ్' 'కాటమరాయుడు' 'అజ్ఞాతవాసి' వంటి సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. దాంతో అవేమీ కూడా 'అత్తారింటికి దారేది' కలెక్షన్లను అధిగమించలేక పోయాయి.ఇక వకీల్ సాబ్ సినిమాతో ఆదిగమించాడు.2013 లో విడుదలైన 'అత్తారింటికి దారేది' చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి రూ.75 కోట్ల షేర్ ను రాబట్టి.. అప్పుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఇన్నాళ్టికి 'వకీల్ సాబ్' చిత్రం 6వ రోజునే వరల్డ్ వైడ్ గా 77కోట్ల షేర్ ను రాబట్టి.. ఆ రికార్డుని బ్రేక్ చేసింది. ఇక ఈరోజు తో ఈ సినిమా టోటల్ గా 79 కోట్లు రాబట్టింది.పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యథిక కలెక్షన్లు రాబట్టిన మూవీగా ఇప్పుడు 'వకీల్ సాబ్' నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: