కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు చేయి దాటిపోవడంతో టాప్ యంగ్ హీరోలు అంతా తమ సినిమా షూటింగ్ లను రద్దు చేసుకుని తమ ఇళ్లకే పరిమితం అయిపోతున్నారు. అయితే ఈ పరిస్థితులను లెక్క చేయకుండా నాగచైతన్య చేసిన సాహసం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ తో నాగచైతన్య ‘థాంక్యూ’ అన్న మూవీని మొదలుపెట్టిన విషయం తెలిసిందే.


ఈమూవీలో చైతన్య మహేష్ బాబు వీరాభిమానిగా నటిస్తూ అతడి కటౌట్ లకు పాలాభిషేకం చేసే అభిమానిగా కనిపించబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్ ఇప్పటికే వైజాగ్ లో పూర్తి అయింది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ ఇటలీలో ప్లాన్ చేసారు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు వల్ల ఈమూవీ ఇటలీ షెడ్యూల్ రద్దు అయింది అన్న ప్రచారం జరిగింది. అయితే జరిగిన వాస్తవం వేరు.


ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ పరిస్థుతులు కొనసాగుతూ ఉన్నా వాటిని లెక్క చేయకుండా చైతన్య ప్రోత్సాహంతో ఈమూవీ సెకండ్ షెడ్యూల్ ను ధైర్యంగా ఇటలీలో ప్రారంభించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్న పీసీ శ్రీరామ్ షూటింగ్ లొకేషన్స్ తీసిన ఫోటోలను నాగచైతన్య విక్రమ్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ పాండమిక్ టైంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా షూట్ చేస్తున్నారో వివరించారు.


ఇటలీలో 15 రోజుల పాటు కొనసాగే ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ప్రభాస్ లాంటి టాప్ యంగ్ హీరోలు తమ సినిమాలకు సంబంధించిన ఫారిన్ షెడ్యూల్స్ ను క్యాన్సిల్ చేసుకుని ఇండియాలోనే ముఖ్యంగా హైదరాబాద్ దాటకుండా తమ సినిమాల షూటింగ్ లలో మార్పులు చేస్తే నాగచైతన్య మాత్రం పరిస్థితులను ఎదిరిస్తూ అనుకున్న విధంగా తన సినిమాను  ఇటలీలో షూటింగ్ కొనసాగించడం అతడి డేరింగ్ నేచర్ ను బయటపెడుతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి: