దేశంలో క‌రోనా విజృంభ‌న కొన‌సాగుతుంది. రోజురోజుకు వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు ల‌క్ష‌ల్లో కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే త్వర‌లో క‌రోనా థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌ని దాని ప్ర‌భావం మ‌రింత దారుణంగా ఉండ‌బోతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్న‌రు. అయితే క‌రోనా థ‌ర్డ్ వేవ్ ను ఎదురుకోవ‌డానికి ప్ర‌భుత్వం ఎలాంటి చర్య‌లు తీసుకోబోతుంది. ఎలా ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడుతుంది అన్న ప్ర‌శ్న‌లకు ఇప్ప‌టికైతే ఎలాంటి స‌మాధానం లేదు. కానీ రియ‌ల్ హీరో సోనూసూద్ మాత్రం థ‌ర్డ్ వేవ్ నుండి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించడానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా ఉదృతితో ఆక్సీజన్ కొర‌త తీవ్రంగా నెల‌కొన్ని సంగ‌తి తెలిసిందే. ఆక్సీజ‌న్ కొర‌త‌తో దేశంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే క‌రోనా థ‌ర్డ్ వేవ్ లో మ‌రింత ఆక్సీజ‌న్ కొర‌త ఏర్ప‌డేలా ఉంద‌ని భావించిన సోసూ ఆక్సీజ‌న్ ప్లాంట్ ల‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఆక్సీజ‌న్ కొర‌త ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల్లో సోనూ ఆక్సీజ‌న్ ప్లాంట్ ల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఇప్ప‌టికే ఫ్రాన్స్ నుండి ఓ ఆక్సీజ‌న్  ప్లాంట్ ను ఆర్డ‌ర్ చేశామ‌ని మ‌రో 10 నుండి 12 రోజుల్లో ఇక్క‌డ‌కు చేరుతుంద‌ని సోనూసూద్ తెలిపారు. అంతే కాకుండా మ‌రికొన్ని దేశాల నుండి కూడా ప్లాంట్ ల‌ను కొనుగోలు చేసేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని సోనూసూద్ వెల్లడించారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు పెద్ద స‌వాలుగా మారాయి...ప్ర‌తిదీ స‌మ‌యానికి అందించేలా మా వంతు కృషి చేస్తున్నాము. ఇక ఈ ప్లాంట్ ల ద్వారా మ‌న ప్రాణాల‌ను కాపాడుకోగ‌లం అంటూ సోనూ పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా సోనూసూద్ క‌రోనా ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యం నుండి త‌న స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తున్నారు. లాక్ డౌన్ వేళ సోనూ ఎంతో మంది  వ‌ల‌స కూలీల‌ను వారి గ్రామాల‌కు త‌ర‌లించి రియ‌ల్ హీరో అనిపించుకున్నారు. ఇక ఇప్పుడు ఎంతో మంది క‌రోనా బాధితుల‌కు త‌న టీం తో క‌లిసి ఆక్సీజ‌న్, రెమిడెసివిర్ ఇత‌ర అత్య‌వ‌స‌ర‌మైన ఓష‌దాల‌ను అందిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: