టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బాస్టర్ చిత్రం తర్వాత నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈ సినిమాతో బిజీగా ఉన్నారు ప్రిన్స్. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ ఆడిపాడనుంది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అదేంటంటే ఈ చిత్రంలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు యాక్షన్ హీరోగా రాణించిన హీరో అర్జున్ ఇప్పుడు ప్రతినాయకుడి పాత్రలోనూ అదుర్స్ అనిపిస్తున్నారు. లై సినిమాతో విలన్ గా సత్తా చాటిన అర్జున్ ఆ తర్వాత అదే తరహా పాత్రల వైపు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సర్కారు వారి పాట చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కోసం ఇప్పటి వరకు బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్, కోలీవుడ్ ప్రముఖ నటుడు అరవిందస్వామి, ఉపేంద్ర, కిచ్చా సుదీప్ వంటి పలువురు ప్రముఖుల పేర్లు వినిపించగా ఇప్పుడు యాక్షన్ హీరో అర్జున్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విలన్ పాత్రపై చాలా కీలకమని ఆ పాత్రకు అర్జున్ అయితే సరిగ్గా సరిపోతారని ఆయన చిత్ర యూనిక్ సెలెక్ట్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
అయితే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. భారీ బ్యాంకుల కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఫుల్ బజ్ క్రియేట్ అయింది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఇలా వరుస బ్లాక్ బస్టర్ ట్రాక్ లో దూసుకుపోతున్న మహేశ్ నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం కావడంతో సర్కారు వారి పాట మీద భారీ అంచనాలే నెలకొన్నాయి.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి