ఈ మధ్య సినిమాలు అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అంటే ట్రైలర్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటున్నాయి. ఈ ట్రైలర్ ని చూసి ప్రేక్షకులు ఆ సినిమాపై లేనిపోని అంచనాలు పెట్టుకుంటారు. తీరా ఆ సినిమా థియేటర్లో విడుదల అయ్యాక మొదటి రోజుకే ఫట్ మంటుంది. ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ చర్చ అంతా దేని గురించో తెలుసా ? మొన్ననే విడుదలయిన ధనుష్ మూవీ "జగమే తంత్రం" ట్రైలర్ గురించి, ఈ ట్రైలర్ చూస్తే కథ ఇట్టే అర్ధం అవుతోంది. ట్రైలర్ ప్రకారం ఒక సాధారణ యువకుడు ఇండియా నుండి ఫారిన్ వెళ్లి అక్కడ మాఫియా డాన్ గా మారుతాడు. ఈ కథాంశంతో ఇప్పటికే ధనుష్ మామ రజనీకాంత్ కబాలి సినిమా తీసిన విషయం తెలిసిందే.
కబాలి సినిమా ఫలితం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఫాన్స్ పెట్టుకున్న అంచనాలను తలక్రిందులు చేసింది. ఈ సినిమాను కేవలం రజనీ స్టైల్ కోసం చూడవచ్చు. ధనుష్ కూడా స్టైల్ కి పెట్టింది పేరు. మాస్ నటనలో మామను మించి పోతాడు. ప్రస్తుతం ధనుష్ ఫాన్స్ ఈ సినిమా ట్రైలర్ చూసి అంచనాలు భారీగా పెట్టుకున్నారు. దీని విషయంలో ఏమి జరుగుతుందో తెలియాలంటే ఈ నెల 18 వరకు వేచి చూడక తప్పదు. కరోనా కారణంగా థియేటర్లు మూతబడిన సంగతి తెలిసిందే. దీనితో ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న చిన్న సినిమాలు అన్నీ డిజిటల్ ప్లాట్ ఫామ్ బాట పడుతున్నాయి.
థియేటర్లు మూతబడడం వలన నిర్మాతలు బాగా ఇబ్బంది పడిపోతున్నారు. ఓటిటి కంపెనీలు సినిమాకి తగినట్లుగా మంచి ఆఫర్ లే ఇస్తున్నప్పటికీ, థియేటర్ల వచ్చేంత అమౌంట్ అయితే ఇవ్వట్లేదనేది వారి భావన. ధనుష్ మూవీ ఓ టి టి లో విడుదలయ్యి సంచలనం సృష్టిస్తుందా లేదా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక చతికిలబడుతుందా తెలియాల్సి ఉంది. సినిమా ఎక్కడ రిలీజ్ అయినా ఎప్పుడు రిలీజ్ అయినా సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇంతకు ముందు ఈ నగ్నసత్యాన్ని చాలా సినిమాలు రుజువు చేసి చూపించాయి. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా, సంతోష్నారాయణన్ స్వరాలను సమకూర్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి