వెంకటేష్ తో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేశారు. వెంకటేష్ నన్ను కలిసేందుకు హైదరాబాద్ నుంచి ముంబై నడుచుకుంటూ వచ్చాడు. అతడు తిరిగి ఇంటికి చేరుకునేందుకు నేను రవాణా సౌకర్యం ఏర్పాటు చేశాను. నాకు ఓ వైపు గర్వంగా ఉన్నప్పటికీ ఇలాంటివి ప్రోత్సహించలేను. దయచేసి ఎవరూ ఇలాంటి చర్యలకు ఉపక్రమించవద్దు అని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆ వ్యక్తి తో కాసేపు ముచ్చటించి అతని ఇబ్బందులను తెలుసుకుని ఆ ఇబ్బందులను తీర్చుతానని మాట ఇచ్చాడు.
కరోనా సమయంలో సోనూసూద్ చేసిన సేవలకు ఆయనకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. వలస కూలీలు తమ సొంత ఊళ్లకు వెళ్లే క్రమంలో పడ్డ ఇబ్బందులను గమనించి వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి సోనుసూద్ వారిలో మంచి అభిమానాన్ని పొందాడు. వారి గుండెల్లో కొలువుదీరాడు. అన్నా సహాయం అని కోరిన ప్రతి ఒక్కరికి సోనూసూద్ హెల్ప్ చేశాడు. ఈ క్రమంలో ఆయనకు వేలకు వేల లెటర్స్, వేలకు వేల ఈమెయిల్స్, మెసేజ్ లు రావడంతో అందరికీ తాను సహాయపడలేక పోతున్నానని బాధ ఆయనను ఎంతో తొలిచి వేసిందట. మరి భవిష్యత్తులో సోనూసూద్ నుంచి ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చూడబోతామో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి