అయితే ఒకప్పుడు ఉదయ భాను కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఉదయభాను బుల్లితెర అందాల యాంకర్. అందం, అభినయం ఆమె సొంతం. ఒకప్పుడు యాంకరింగ్ సామ్రాజ్యంలో తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుని మహారాణిగా కొనసాగిన వ్యాఖ్యాత. ఈ అచ్చ తెలుగమ్మాయి 10 వ తరగతి చదువుతుండగా ఇండస్ట్రీకి వచ్చింది. యాంకరింగ్ అనే మాటకు అర్థం తెలియని వయసులోనే హృదయాంజలి అనే షో కోసం మైకు పట్టి ప్రజలతో గలగల మాట్లాడుతూ అందరినీ అలరించింది. ఆ తరువాత వన్స్ మోర్ ప్లీజ్,
సాహసం చేయరా డింభకా, రేలారే రే రేలా, డాన్స్ బేబీ డాన్స్ రియాలిటీ డాన్స్ షో, పిల్లలు పిడుగులు, జానవులే నెరజాణవులే వంటి షోలతో తెలుగు ప్రేక్షకులను తన యాంకరింగ్ తో మంత్ర ముగ్ధుల్ని చేసింది. బుల్లితెరపై హాట్ గా కనిపించిన మొదటి యాంకర్ గా కూడా ఈమె కావడం విశేషం.