సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ తీసిన తొలి సినిమా శ్రీమంతుడు. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. మహేష్ బాబు, హర్ష అనే మల్టీమిలియనీర్ కొడుకుగా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఒక ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు కొరటాల ఈ మూవీని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.
ఇక మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి దర్శకుడిగా కొరటాలకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత కొంత గ్యాప్  అనంతరం మరొక్కసారి మహేష్ తో కొరటాల తీసిన మూవీ భరత్ అనే నేను. కియారా అద్వానీ హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తన బాధ్యతలను పక్కాగా నిర్వహించాలనే కాన్సప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సీఎం భరత్ గా సూపర్ స్టార్ మహేష్ అద్భుతంగా యాక్ట్ చేసారు.
విడుదల తరువాత అత్యద్భుత విజయం అందుకున్న ఈ సినిమా మహేష్, కొరటాల మధ్య మరింత మంచి బాండింగ్ ని ఏర్పరిచింది అనే చెప్పాలి. అసలు విషయం ఏమిటంటే నేడు కొరటాల శివ జన్మదినం కావడంతో ఉదయం నుండి పలువురు ప్రేక్షకులు, సినిమా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తుండగా, కొద్దిసేపటి క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కొరటాలకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పారు. 'హ్యాపీ బర్త్ డే కొరటాల గారు, మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, సంతోషంతో జీవితాన్ని కొనసాగించాలి అంటూ సూపర్ స్టార్ మహేష్ పెట్టిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ తో ఆచార్య మూవీ చేస్తోన్న కొరటాల, త్వరలో ఎన్టీఆర్ తో తదుపరి సినిమా చేయనున్న విషయం తెలిసిందే ..... !!

 

మరింత సమాచారం తెలుసుకోండి: