
తెలుగులో రాజకీయ కథా నేపథ్యంలో వచ్చిన సినిమా లీడర్.. రానా దగ్గుపాటి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే భారీ హిట్ టాక్ ను అందుకున్నాడు. తన తండ్రి చనిపోతే అతను స్థానంలో ముఖ్యమంత్రి అవుతాడు. ఒకవైపు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన , మరోవైపు రాజకీయ నేతల ఒత్తిడి ఇవ్వన్నీ తట్టుకొని ప్రజలకు ఎలా సేవలను అందిస్తాడు అన్నది ఈ సినిమా కథ.
.jpg)
సీఎం అయిన తర్వాత ప్రజలకు ఎటువంటి పథకాలను అందిస్తే మంచి జరుగుతుంది. ఈ విషయాలను దర్శకుడు ఎంతో చక్కగా చూపించాడు. ముఖ్యమంత్రి అయిన అర్జున్ ప్రసాద్ ను తన దారిలోకి తీసుకొచ్చేందుకు హీరో పెద్దనాన్న విశ్వప్రయత్నాలు చేస్తాడు. రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల నల్ల ధనాన్ని బయటికి తీసి ప్రజలకి అందేలా చూడాలన్న లక్ష్యంతో ఉన్న అర్జున్ ప్రసాద్ తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం తన పార్టీకి ప్రధాన మద్దతుదారయిన మునుస్వామి కూతురితో ప్రేమలో ఉన్నట్లు నటిస్తాడు. తానూ ఈ పదవిలో ఉండలేక రాజీనామా చేస్తాడు. .jpg)
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి