ఇక ట్రైనింగ్ డే పేరుతో సోషల్ మీడియాలో అల్లు వారబ్బాయి శిరీష్ ఫిట్ నెస్ కు సంబంధించిన ఓ వీడియోను అప్‌లోడ్ చేయగా.. ప్రస్తుతం దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి వీడియోలో బ్యాక్ వర్కవుట్స్ గురించి చూపించిన శిరీష్.. ఆ తర్వాత జిమ్‌లో ఈ హీరో ఎంత కష్టపడ్డాడనేది ఈ వీడియోలో మనకు కళ్లకు కట్టినట్లు చూపించాడు.
అలాగే ఈ వీడియోలో ముందుగా తాను వామప్ చేసిన తర్వాత ఒక్క చేతితో డంబెల్స్ ను లిఫ్ట్ చేయడం మెస్మరైజ్ చేస్తోంది. ఇక 30 సెకన్ల పాటు వీడియోలో జిమ్‌కు సంబంధించిన చాలా రకాల అంశాలను చూపించాడు శిరీష్. అలాగే తన వర్కవుట్ షెడ్యూల్‌లో ఏమేం ఫిట్ నెస్ సూత్రాలు ఉన్నాయో ఈ డిజిటల్ సిరీస్‌లో చూపించే ప్రయత్నం చేశాడు ఆయన.
అయితే వీడియోలో కేవలం జిమ్ ట్రైనింగ్, ఫిట్‌నెస్ తో పాటుగా యోగా, బాక్సింగ్‌కు సంబంధించిన చాలా రకాఅ అంశాలను కూడా ఇందులో చూపించబోతున్నాడు ఈ హీరో. ఆయన స్వయంగా గోల్స్ సెట్ చేసుకుని మరీ ఫిట్‌నెస్ పరంగా వాటిని చేరుకుంటున్నారు అల్లు శిరీష్. ఇప్పుడు కూడా తన ఫాలోయర్స్ కోసం కొన్ని వీడియోలు పెట్టిన ఈయన ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇచ్చేందుకు రెడీ అవుతునున్నారు అల్లు శిరీష్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి