మెగాస్టార్
చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే
సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సరసన
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా
రామ్ చరణ్ తేజ ఈ సినిమాను మలుపుతిప్పే పాత్రలో నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా
టాలీవుడ్ స్టార్
హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. కమర్షియల్ సినిమాలకు సామాజిక అంశాలు జోడించి చేయడంలో, హిట్ కొట్టడం లో
కొరటాల శివ కు ప్రత్యేక శైలి ఉంది.
చిరంజీవి నటించిన ఈ కమర్షియల్ సినిమాకి కూడా తనదైన స్టైల్ లో సామాజిక అంశాలు జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ
సినిమా నుంచి ఓ పాట విడుదల కాగా అంతకు ముందు విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ రెండు అప్డేట్ లతోనే మెగా అభిమానులు ఈ
సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే
మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలకు సంగీతం విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారో అందరికీ తెలిసిందే. అందుకే ఆయన సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చినా కూడా పాటలు మాత్రం సూపర్ హిట్ అవుతాయి.
చిరంజీవి కమర్షియల్ సినిమాలే కాకుండా కొన్ని సమాజాన్ని ఉద్దరించేటట్లు గా ఉండే సినిమాలు కూడా చేశారు. వాటిలో రుద్రవీణ, ఠాగూర్ సినిమాలు కూడా ఉన్నాయి.
ఈ సినిమాలో శ్రీశ్రీ గారు రచించిన కొన్ని వ్యాఖ్యలను వాడి పాటలు గా పెట్టుకోబోతున్నారట చిరంజీవి. అలా ఆయన
శ్రీ శ్రీ గారి వ్యాఖ్యలను పాడిన పాటలు ఎంత పెద్ద హిట్టో అందరికీ చెప్పనవసరం లేదు. రుద్రవీణ సినిమాలో చెప్పాలని ఉంది పాట అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలవగా ఠాగూర్ సినిమాలోని నేను సైతం అనే పాట మరో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ రెండు సినిమాల్లోనే కాకుండా ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమాలో కూడా ఓ పాటలో కొన్ని వాక్యాలు వాడ పోతున్నారట. ఇప్పుడు ఆచార్య లో కూడా అదే తరహాలో
శ్రీ శ్రీ రాసిన వ్యాఖ్యలను వాడుతుండటంతో ఈ పాట ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.