సినిమా పరిశ్రమలో అయినా ఏ నటుడికైన గుర్తింపు అనేది కొన్ని సినిమాల్లో తర్వాతనే వస్తుంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న నటీనటులు మంచి సినిమా ద్వారా ఆరంగేట్రం చేసి తొలి సినిమా నుంచి పాపులారిటీని అందిపుచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దొరికిన అవకాశం చేస్తూ సక్సెస్ అవుతూ ఉంటారు. అలా వారు మొదట్లో ఏ పాత్ర వచ్చినా చేస్తూ తమ గుర్తింపును పెంచుకునే విధంగా సినిమాలు చేస్తూ పెద్ద అవకాశాలను పొందుతారు. 

ఆ విధంగా ఇప్పటి టాప్ హీరోయిన్ లు కొందరు మొదట్లో అవకాశాల్లేక చిన్న సినిమాలను కూడా చేసి  దర్శకనిర్మాతల కళ్ళలో పడి పెద్ద సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. అలాంటి హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, అనుష్క, తమన్నా, కీర్తి సురేష్ లు కూడా ఉన్నారు. వీరేంటి అందరూ ముద్దుగుమ్మలు కూడా మొదట్లో చిన్న సినిమాలు చేసి ఎదిగిన వారే. వారిలో ఎవరె వరు ఏ సినిమాల్లో నటించారో ఇప్పుడు చూద్దాం. ఇంత పెద్ద హీరోయిన్లు ఇలాంటి సినిమాలు చేశారా.. ఊరు పేరు తెలియని నటులతో కలిసి స్క్రీన్ చేసుకున్నారా అని ఆ సినిమాలను చూస్తే అనిపిస్తుంది.

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు మాత్రమే చేస్తున్న కీర్తి సురేష్ తన కెరీర్ ఆరంభంలో రెండు జెళ్ళ సీత అనే సినిమాలో నటించింది. బాలీవుడ్ లో సైతం వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తన కెరియర్ ఆరంభంలో కెరటం అనే సినిమాను చేశారు. ఇది రిలీజ్ అయ్యిందో లేదో కూడా ఎవరికీ తెలియదు. అనుష్క శెట్టి రెండు అనే సినిమాను చేశారు. ఇది ఎప్పుడు తెరకెక్కిందో కూడా ఎవరికీ తెలియదు. తమన్నా వ్యాపారి అనే సినిమాను చేశారు. సమంత బానా కాతాడి అనే సినిమా చేశారు. పూజా హెగ్డే మూగముడి అనే సినిమా చేశారు. కాజల్ అగర్వాల్ ఓం శాంతి, అంజలి ఫోటో, నిత్యామీనన్ ఒక్కడినే, నివేద థామస్ జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, ప్రగ్య మిర్చి లాంటి కుర్రాడు, ఇలియానా కేడి, శృతిహాసన్ లక్, నయనతార అయ్యా అనే గుర్తు తెలియని సినిమాల్లో నటించారని చాలా తక్కువ మందికి తెలుసు. 

మరింత సమాచారం తెలుసుకోండి: