అయితే బాబి గురించి ఎవ్వరికి తెలియని విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. బాబి తన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఓపెన్ చేశారు. బాబి రచయిత.. దర్శకుడు కావడానికి ముందే హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉందట. అది కూడా గంగోత్రి సినిమాతో..! దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా గంగోత్రి సినిమా 2003లో వచ్చింది. అది అల్లు అర్జున్‌కు డెబ్యూ మూవీ.. ! అయితే ఆ సినిమా ను ముందుగా బాబీతో చేయాలని అనుకున్నారట.
ఆ సినిమాలో నటించాలంటే క్యారెక్టర్ పరంగా నిక్కర్ వేసుకోవాలని చెప్పడంతో తాను ఆ సినిమా చేయనని బాబీ చెప్పేశాడట. ఒకప్పుడు బాబీ గుంటూరులో చిరంజీవి అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా ఉండేవాడు. అప్పుడు చిన్ని కృష్ణతో ఇంద్ర సినిమా టైంలో పరిచయం ఏర్పడిందట. హైదరాబాద్ వచ్చినప్పుడు చిన్ని కృష్ణను బాబి కలవడంతో ఆయన రాఘవేంద్ర రావు గారి దగ్గరకు పంపారట. గంగోత్రిలో హీరో ఛాన్స్ ఇస్తాము అని చెప్పడంతో పాటు నిక్కర్ లో నటించాలని చెప్పడంతో తన పరువు పోతుందని బాబి ఒప్పు కోలేదట. అలా గంగోత్రి సినిమాతో హీరో అవ్వాల్సిన బాబి.. చివరకు రచయితగా.. ఇప్పుడు డైరెక్టర్ గా స్థిరపడిపోయాడు.. అది సంగతీ..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి