తమిళ అగ్ర నటుడు కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్..హీరోయిన్ గా ఎలాంటి గుర్తింపును తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కేవలం నటిగానే కాకుండా ఒక సింగర్ కూడా తానేంటో ప్రూవ్ చేసుకుంది. ఇక టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి..తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ ని కైవసం చేసుకుంది. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు..కొన్ని తప్పిదాల వల్ల శ్రుతిహాసన్ కి గత కొంతకాలంగా సినిమా అవకాశాలు ఏవీ రాలేదు.ఇక అదృష్టవశాత్తూ రీసెంట్ గా మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన ఈ హీరోయిన్..

గత కొంతకాలంగా శాంతను హాజారిక అనే తన స్నేహితుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది శృతిహాసన్.ఆ మధ్య లాక్ డౌన్ సమయంలో ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.ఇక తాజాగా శృతిహాసన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.ఈ వీడియోలో శృతి తో పాటూ తన బాయ్ ఫ్రెండ్ హజారిక కూడా ఉన్నాడు.వీరిద్దరూ కలిసి చికెన్ తో తయారు చేసిన వంటకాలను తింటూ ఉండడం కనిపించింది.అంతేకాదు వీడియో కింద 'వేయించిన చికెన్ ఇష్టపడతాము' అనే క్యాప్షన్ ని జోడించారు.

ఇక వీడియో లో యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేద్దామా అని శ్రుతిహాసన్ అన్నారు.ఫ్రై చికెన్ అంటూ సాంగ్ పాడుతూ..ఎంజాయ్ చేశారు ఈ ఇద్దరూ.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.ఇక పఇటీవలే రవితేజ సరసన క్రాక్, పవన్ కళ్యాణ్ తో 'వకీల్ సాబ్' సినిమాల్లో హీరోయిన్ గా నటించి..బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకొని.. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా మారింది. ఇక తాజాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి జోడిగా 'సలార్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది శ్రుతిహాసన్.కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.హోంబలే నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: