బుల్లితెరపై సుడిగాలి సుధీర్ రష్మీ జోడి కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  బుల్లితెరపై ఇద్దరు ఎక్కడ కనిపించినా చాలు ఇక ప్రేక్షకులందరూ మురిసిపోతూ ఉంటారు.  ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నో రోజుల నుంచి టాక్ వినిపిస్తుంది. ఇక ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని అటు బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  ఇద్దరి జోడి కి ఉన్న క్రేజ్ ని అటు ఈటీవీ నిర్వాహకులు కూడా బాగానే యూస్ చేస్తున్నారు.


 అప్పుడెప్పుడో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు అని అందర్ని ఆకర్షించటానికి ఆహనా పెళ్ళంట అనే ఒక పండుగ ఈవెంట్ కూడా చేసి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు ఈ టీవీ ప్రేక్షకులు. ఇంతకీ అసలు సుడిగాలి సుధీర్ రష్మీ పెళ్లి చేసుకుంటారా అంటే ఏమో మరి ఆ విషయం దేవుడికే తెలుసు అని చెబుతూ ఉంటారు.  ఇక ఇటీవల యాంకర్ రష్మీ.. నేను పెళ్లికి రెడీ అంటూ షాక్ ఇచ్చింది.  అయితే యాంకర్ రష్మీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది మాత్రం సుడిగాలి సుదీర్ నీ కాదు.. ఏకంగా ఒక ఐదేళ్ల చిన్నోడిని. ఏంటి షాక్ అయ్యారు కదా..



 అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు లెండి రీల్ లైఫ్ లో. ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో ఎప్పటిలాగానే ఎంతో సందడి సందడిగా సాగింది  ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో  చక్కెర్లు కొడుతుంది ఈ ప్రోమో.  ఇకపోతే ఈ ప్రోమో లో భాగంగా జిగేల్ జీవన్ స్కిట్ మొదట వస్తుంది.  ఇక ఈ స్టేట్ లో భాగంగా ఇద్దరు చిన్నారులను స్కిట్ లో భాగం చేసుకుంటాడు జిగేల్ జీవన్.  ఇక ఈ క్రమంలోనే స్కిట్ లో ఐదేళ్ల బుడ్డోడు కూడా ఉంటాడు.  ఇక జడ్జి రోజా గారి పేరు ఎత్తగానే ఆ బుడ్డోడు ఏకంగా  నమస్కారం చేస్తాడు.  ఇక రష్మీ వైపు చూపించగానే వెంటనే వెళ్లి రష్మి కి ముద్దు ఇస్తాడు.  వీడికి పెళ్లి వయసు వచ్చేసింది ఇక పెళ్లి చేయాలి అని ఆ సమయంలో జీవన్ అంటాడు. నేను పెళ్ళికి రెడీ రా వచ్చేయ్ అంటూ యాంకర్ సీట్లో కూర్చున్న రష్మి చెబుతుంది.  దీంతో అందరూ నవ్వుకున్నారు. ఆ బుడ్డోడు మాత్రం షాక్ అవుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: