టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం తమిళ దర్శకుల, హీరోల సినిమాల పై మోజు పడడం టాలీవుడ్ లో కొంత చర్చనీయాంశంగా మారుతోంది. ఆయన శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా, విజయ్ హీరోగా మరో సినిమా లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఎన్ని సినిమాలు చేసినా క్వాలిటీ విషయంలో రేంజ్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కానీ దిల్ రాజు ఇప్పుడు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమా లను తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు టాప్ హీరోలందరూ ఇతర భాషలకు చెందిన అగ్ర దర్శకులతో సినిమాలు చేస్తుండడంతో పెద్ద సినిమాలు చేయాలంటే తనకు హీరోల సమస్య  ప్రధానంగా ఏర్పడుతుంది.

ఈ నేపథ్యంలోనే తాను కూడా ఇతర భాషల హీరోల వైపు చూస్తున్నాడు. వేరే ఇండస్ట్రీలోనూ పాగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా స్టార్ హీరోలు, డైరెక్టర్లతో సినిమా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈమధ్య తమిళ హీరోలు దర్శకుల వెంట ఎక్కువ తిరుగుతున్నట్లు తెలుస్తుంది. పెద్ద స్థాయి సినిమా లు తెరకెక్కించడం లో టాలీవుడ్ ఆధిపత్యంతో కొనసాగుతుంది. మామూలు సమయంలోనే ఒకేసారి అరడజను సినిమాలను తెరకెక్కించే దిల్ రాజు ఇప్పుడు కూడా పెద్ద సినిమా ల విషయంలో కూడా అదే విధంగా సినిమా లు చేస్తున్నాడు. 

ఈ నేపథ్యంలో దిల్ రాజు ఈ రకంగా సినిమాలు చేస్తూ మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఇండియన్ 2 సినిమా తెరకెక్కించడానికి తానే l ముందుకు వచ్చి పరిస్థితిని గమనించి వెనక్కి తగ్గాడు. దాని తర్వాత శంకర్ నెక్స్ట్ చిత్రాన్ని దక్కించుకుని సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రామ్ చరణ్ తో శంకర్ సినిమా చేయడానికి ముఖ్య కారణం ఆయనే.  అలాగే తమిళంలో నెంబర్ వన్ హీరో విజయ్ , వంశీ పైడిపల్లి లతో సినిమా చేయబోతున్నాడు దిల్ రాజు. సూర్య, బోయపాటి శ్రీను ల సినిమా టాక్స్ లో ఉంది. ఇక జెర్సీ,ఎఫ్2 చిత్రాలతో బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. హీరోలేనా నిర్మాతలు కూడా పాన్ ఇండియా ఇమేజ్ పేరు తెచ్చుకోవాలని దిల్ రాజు ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: