టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అక్కినేని సమంత కు ప్రత్యేక స్థానం ఉంది. ఆమె హీరోయిన్ గా ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఆమెకు అభిమానులు కోట్ల మంది ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అందానికి అందం అభినయానికి అభినయం కలిగి ఉన్న సమంతమాయ చేశావే చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమై ఆ తర్వాత స్టార్ హీరోలందరితో నటించి తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ప్రస్తుతం ఆమె అక్కినేని నాగ చైతన్య ను పెళ్లిచేసుకుని లైఫ్ లో సెటిల్ కావడంతో పెద్ద సినిమాల అవకాశాలు రావడంలేదు. లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో మరియు కొన్ని వెబ్ సిరిస్ లలో మాత్రమే ఈమె నటిస్తూ వస్తుంది. అక్కినేని నాగచైతన్య ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాలు తగ్గించుకుంటునే వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె చేతిలో ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమా తప్ప మరేది లేదు. కొన్ని వెబ్ సినిమాల లోను కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే తాజాగా ఆమెకు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ప్రాజెక్ట్ కే సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా కాకుండా ఓ కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. నిజానికి సమంత హీరోయిన్ మెటీరియల్ అలాంటి సమంతను హీరోయిన్ గా కాకుండా అదే పెళ్లయిన దీపిక పడుకొనే ను హీరోయిన్ గా ఎంచుకోవడం తో సమంత అభిమానులు నాగ అశ్విన్ పై మండి పడుతున్నారు. సమ్ము ను హీరోయిన్ గా కాకుండా కీలక పాత్రకు తీసుకోవడం ఆమెను అవమాన పరచడమే అని చిత్ర బృందాన్ని మీడియాలో ఏకిపారేస్తున్నారు. మరి చూస్తుంటే సమంతా కి ఇకపై క్యారక్టర్ ఆర్టిస్ట్ ల పాత్రలే ఎక్కువ రావడం కనిపిస్తుంది. భవిష్యత్ లో ఆమె ఇలాంటి రోల్స్ చేయలేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: