మాస్ హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు విశ్వక్‌ సేన్. ‘ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌ నూమా దాస్, హిట్’ చిత్రాలతో తనకంటూ ఓ మార్కెట్ ఏర్పరుచుకున్నాడు ఈ యంగ్ హీరో. కాగా, విశ్వక్ సేన్ నటించిన ‘పాగల్’ సినిమా ఈ నెల 14న విడుదల కాబోతున్నది. దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, బెక్కెమ్ వేణు గోపాల్ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఫిల్మ్‌కు నరేశ్ కుప్పిలి డెరెక్టర్. కగా రధన్ సమకూర్చిన సాంగ్స్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సిమ్రన్ చౌదరి, మేఘ లేఖ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

 సినిమా విజయంపై మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ హీరో కార్తీకేయ పేర్కొన్నారు. యంగ్ హీరో విశ్వక్ సేన్ ముక్కు సూటి మనిషని చెప్పారు కార్తీకేయ. తెరపై విశ్వక్‌సేన్ డ్యాన్సెస్ చూస్తుంటే తనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తాడని తెలిపాడు. ఇకపోతే విశ్వక్ డ్యాన్సింగ్ స్టైల్ ప్లస్ యాక్టింగ్ యూనిక్ అని పేర్కొన్నాడు.


సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగ్గా, అందులో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ‘పాగల్’ సినిమాపై మూవీ యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ భూమిక కీ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా ‘పాగల్’ నిలిచిపోతుందని  ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చిన అతిథులు పేర్కొన్నారు. విశ్వక్‌సేన్ నెక్ట్స్ మూవీ వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉండ బోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘గామి’ అనే టైటిల్ ఖరారు కాగా చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే మూవీ యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించనుంది.మరి పాగల్ సినిమా విశ్వక్ సేన్ కి ఎంత వరకు ప్లస్ అవుతుందో అనే విషయం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: