సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే సమంత అక్కినేని తనకు సంబంధించిన ఆసక్తికరమైన ఫొటోలు వీడియోలు షేర్ చేసుకుంటారు. కరోనా సమయంలో ఆమె తన ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా పెంచుకున్నారు. ఆమె సోషల్ మీడియా అప్డేట్స్ పొందడానికి అకౌంట్స్ లేనివారికి కూడా కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. కేవలం టాలీవుడ్ కే పరిమితం కాకుండా భారతదేశంలోని అన్ని ప్రముఖ భాషలలో నటించిన ఆమె మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం శాకుంతలం సినిమాతో ఆమె ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా ఆమె తాజాగా షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఇటీవల ఆమె తన స్నేహితులతో కలిసి నైట్ పార్టీలో పెద్ద రచ్చ చేసారు. తన బిజినెస్ భాగస్వాములతో కలిసి పార్టీలో ఎంజాయ్ చేసిన సమంత తన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. నిజానికి సమంత ఈ స్థాయిలో ఎంజాయ్ చేసినట్టు ఉంది అభిమానులు ఇప్పటివరకు చూసిందే లేదు. కొంటె చేష్టలతో ముద్దులు పెడుతూ ఉన్న ఆమె ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
ఈ పార్టీలో నాన్‌స్టాప్‌గా గంతులు వేస్తూ బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫొటోలు చూస్తుంటేనే.. సమంత చాలాకాలం తర్వాత బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.
నైట్ పార్టీతో పాటు ఆమె ఇటీవల ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌కు హాజరైంది. ఒక సంస్థ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె తన క్లీవేజ్‌ షో తో చూపు తిప్పుకొనివ్వకుండా చేశారు. తన పడుచు అందాలతో ఆమె హోయలు ఒలికిస్తూ అందర్నీ కట్టిపడేసారు.
కొద్ది రోజుల క్రితం మైథాలజీ ఫిల్మ్‌ ‘శాకుంతలం’ చిత్రీకరణను పూర్తి చేసిన ఆమె తాజాగా పాండిచ్చేరికి చేరుకున్నారు. విఘ్నేశ్‌ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‌ ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమాలో సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పాండిచ్చేరిలో జరుగుతుండగా ఆమె అక్కడికి వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: