ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరోగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు సుధీర్ బాబు.  ఘట్టమనేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వున్నప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. తన నటనతో తన యాక్టింగ్ తోనే కాదు తన బాడీ తో కూడా ఎప్పుడూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు సుధీర్ బాబు. ఇక ఇటీవలే శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పలాస 1978 అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు కరుణ కుమార్ ఇక ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించాడు.



 ఇక ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం మంచి టాక్ తో దూసుకుపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాపై మంచి రివ్యూ ఇస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు నటన అదిరిపోయిందని.. యాక్షన్తో పాటు సెంటిమెంట్ కూడా అద్భుతంగా ఉంది అంటూ ఇక ఎంతో మంది ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆనంది సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. ఒక విషాదమైన ప్రేమ గాధగా సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఇటీవలే ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో ని పోస్ట్ చేశారు హీరో సుధీర్ బాబు.



 అయితే ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ వున్నప్పటికీ తన ఇమేజ్ ను పక్కన పెట్టి సుధీర్ బాబు ఎన్నో ఫీట్లు చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. సుధీర్ బాబు చేసే యాక్షన్ సీన్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు ప్రేక్షకులే ఆశ్చర్య పోతూ ఉంటారు. ఇటీవలే ఒక ఫైటింగ్ స్టెంట్ వీడియో ని  సుధీర్ బాబు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కొన్ని కొన్ని స్ట్రగుల్స్ కోసం ఎన్నో స్ట్రగుల్స్ చేయాల్సి ఉంటుంది అంటూ ఇక ఈ వీడియో కి ఒక కామెంట్ కూడా జత చేశారు సుధీర్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: