గత నాలుగు సీజన్ లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తూ నెంబర్ వన్ రియాలిటీ షో గా నిలిచింది "బిగ్ బాస్". కానీ గత సంవత్సరం కరోనా కారణంగా బిగ్ బాస్ జరగలేదు. కాబట్టి రెండు సంవత్సరాలకు సరిపడా ఎంటర్ టైన్మెంట్ అందించడానికి బిగ్ బాస్ నిర్వాహకులు సిద్దంగా ఉన్నారు. ఎంతో గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 5 మొదటి రోజు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అయి సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌజ్ లోకి 8 మంది ఎంట్రీ ఇచ్చారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా బిగ్ బాస్ లో పాల్గొనబోయే అభ్యర్థుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సారి సీజన్ 5 కి తగ్గట్లే ఎంటర్ టైన్మెంట్ 5x times ఉంటుందని హోస్ట్ నాగార్జున చెప్పారు.
అయితే ఈ సారి బిగ్ బాస్ గేమ్ ను ఎలా డిజైన్ చేశారో అని అంతా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ బిగ్ బాస్ మొదటి టాస్క్ ను స్టార్ట్ చేసేశాడు. ఇందులో రెండవ కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చిన సన్నీ గెలుపొందాడు. ఇప్పుడు బిగ్ బాస్ లోకి 8 వ కంటెస్టంట్ గా ప్రముఖ తెలుగు నటి మామిల్ల శైలజ ప్రియ ఎంట్రీ ఇచ్చింది. ఈమె గత 15 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో ఉంది. కానీ తను హౌజ్ లోకి వెళ్ళే ముందు చాలా బాధలో ఉన్నట్లు తెలుస్తోంది. హోస్ట్ నాగార్జున అడిగిన ఒక ప్రశ్నకు నాకు బిగ్ బాస్ లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ అని ప్రియ తెలిపింది. నాకు ఈ బిగ్ బాస్ రెండవ లైఫ్ ను బ్రతికే అవకాశం ఇస్తే బాగుంటుందని అని చెప్పిన పదంలో, ప్రియ జీవితంలో ఏదో విషాదం జరిగినట్లుగా తెలిసింది. వారి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈమె బిగ్ బాస్ లో ఏ విధంగా ఆడుతుందో తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి