పూర్తి తెలుగు కంటెంట్ తో ప్రారంభించ బడ్డ ఆహా ఒక్క సంవత్సరం తిరిగేలోపే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ గా మారిపోవడానికి గత సంవత్సరం నుంచి కొనసాగుతున్న కరోనా పరిస్థితులు బాగా సహకరించాయి. గత సంవత్సరం నుండి ధియేటర్లకు వెళ్ళే అలవాటు జనానికి పూర్తిగా తగ్గిపోవడంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల వైపు విపరీతంగా ఆశక్తి కనపరిచారు.


అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఉన్నప్పటికీ ఆహా ఇంత త్వరగా స్థిరపడటానికి ఈసంస్థ నిర్వాహకుడు అల్లు అరవింద్ తీసుకున్న నిర్ణయాలు అనేక మళయాళ డబ్బింగ్ సినిమాలను చిన్నచిన్న తెలుగు సినిమాలను క్రమం తప్పకుండా ప్రతివారం ఆహా లో స్ట్రీమ్ చేస్తూ మధ్యమధ్యలో అనేక టాక్ షోలు కూడ కలపదతంతో ఆహా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారందరికీ పరిచయం అయిన ఓటీటీ ఛానల్ గా మారింది.

ఇప్పుడు అల్లు అరవింద్ ఒక అడుగు ముందుకు వేసి ఆహా ను మరింత ముందుకు తీసుకు వెళ్ళడానికి మెగా స్టార్ చిరంజీవి సహాయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవిని ఒప్పించి ఒక వెబ్ సిరీస్ నిర్మాణం చేయాలి అన్న అరవింద్ ఆలోచనలతో వంశీ పైడిపల్లి నందిని రెడ్డి ఒక టీమ్ గా ఏర్పడి చిరంజీవిని ఒప్పించదానికి రకరకాల కాన్సెప్ట్స్ సిద్ధం చేస్తున్నారని అందులో ఒక టాక్ షో కూడ ఉందని అంటున్నారు.


తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవి దర్శకులలో కొందరిని ఎంపిక చేసి వారిని చిరంజీవి ఇంటర్వ్యూ చేస్తూ అలనాటి చిరంజీవి పాత సినిమా విషయాలను నేటి తరానికి తెలిసేలా ఈటాక్ షో ఉంటుందని టాక్. చిరంజీవి ఆహా లో ఎంటర్ అయితే సబ్ స్క్రైబర్స్ మరింతగా పెరుగుతారని అరవింద్ వ్యూహం అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఆహా లో మరిన్ని ఆశక్తికరమైన వెబ్ సిరీస్ లు ఒరిజినల్ చిత్రాలను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. రాబోయే వినాయక చవితిరోజున ఆహా లో రెండు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి అన్నవార్తలు కూడ సందడి చేస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: