ఆ నాటి తెలుగు అగ్ర హీరోయిన్లలో సహజ నటి జయసుధ ఒకరు. అందానికి అందం అభినయానికి అభినయం, సహజ నటనతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధులను చేసి సహజ నటిగా ప్రఖ్యాతి పొంది స్టార్ హీరోయిన్ గా ఎన్నో యేళ్లు రాణించారు. అంతటి అందాల రాశి తాజా ఫోటో ఒకటి ఆమె అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. అసలు జయసుధకు ఏమయ్యింది అంటూ చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. అవును ఇది నిజమే ప్రస్తుతం సహజనటి జయసుధ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం జయసుధ అమెరికాలో ఉంటున్న విషయం తెలిసిందే. ఈమె అనారోగ్యం పాలైన చిన్నారులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఓ సంస్థ కూడా స్థాపించి సేవలు అందిస్తున్నారు.

అయితే ఆ ఫోటో చూస్తే ఈమె జయసుధ పోలికలతో ఉన్న మరో వ్యక్తా...లేక నిజంగానే జయసుధ ఇలా మారిపోయారు అన్న అనుమానం తప్పక వస్తుంది. అంతగా ఆమెలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ ఫోటో చూసిన వారంతా ఈమెకు ఏమైనా అనారోగ్య సమస్య తలెత్తిందా లేక వయసు మీద పడుతుండడంతో సహజంగానే వచ్చిన మార్పా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే జయసుధ ఇలా ఎందుకు మారిపోయారన్న అసలు విషయం తెలియలేదు. అయితే ఈ పరిస్థితికి కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నారు. కానీ ఈ ఫోటో చూసిన తెలుగు ప్రేక్షకులు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు.

మా జయసుధకు ఏమైంది అంటూ కంగారు పడుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో చక్రం తిప్పిన జయసుధ ఆ తర్వాత నిన్న మొన్నటి వరకు వయసుకు తగ్గ పాత్రల్ని ఎంచుకుని ప్రేక్షకుల్ని అలరించారు. ఈమె సినిమాలో నటించి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతోంది. ఈమె సీనియర్ హీరోలు అందరితో నటించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. మరి జయసుధకు ఏమైందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: